హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హేట్ స్పీచ్: గాంధీ ఆస్పత్రికి అక్బరుద్దీన్, వైద్యపరీక్షలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Akbaruddin Owaisi
హైదరాబాద్: అనారోగ్య కారణాలు చెప్పి అరెస్టును తప్పించుకోవాలని చూస్తున్న మజ్లీస్ శానససభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీని పోలీసులు మంగళవారం ఉదయం సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసు వాహనంలో అక్బరుద్దీన్ గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆక్బరుద్దీన్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించే సమయంలో దారి పొడుగునా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

తనకు ఆరోగ్యం సరిగా లేదని, విచారణకు హాజరు కావడానికి నాలుగు రోజుల వ్యవధి కావాలని అక్బరుద్దీన్ గతంలో పోలీసులను కోరారు. అయితే, అక్బరుద్దీన్ ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆయనకు కొద్దిసేపట్లో గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరిగే అవకాశం ఉంది.

గాంధీ ఆస్పత్రికి వెళ్లే సమయంలో అక్బరుద్దీన్ మీడియాపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెలుగు మీడియా తన వద్దకు రావద్దంటూ ఆయన చెప్పారు. గాంధీ ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అక్బరుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేసే అవకాశం కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

న్యాయపోరాటం సాగించడానికి అక్బరుద్దీన్ సోదరుడు, మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ న్యాయనిపుణులను సంప్రదిస్తున్నారు. ఆయన గంటకు పైగా అక్బరుద్దీన్‌తో మాట్లాడారు. అక్బరుద్దీన్ వెంట మజ్లీస్ శానససభ్యులు కొద్ది మంది, కార్యకర్తలు గాంధీ ఆస్పత్రికి వచ్చారు. వైద్య పరీక్షలకు గంటకు పైగా పట్టవచ్చునని అంటున్నారు. గాంధీ ఆస్పత్రి వద్ద అక్బరుద్దీన్‌కు అనుకూలంగా మజ్లీస్ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు.

English summary
MIM MLA Akbaruddin Owaisi, facing allegations of hate speech, has been shifted to Gandhi hospital in Secunderabad for medical tests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X