హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పని చేయని ఎంఆర్ఐ: అక్బర్ వైద్య పరీక్షల్లో జాప్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

Akbaruddin Owaisi
హైదరాబాద్: మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీకి మంగళవారం సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రిలో నిర్వహిస్తున్న వైద్య పరీక్షల్లో జాప్యం జరుగుతోంది. తాను వెన్నునొప్పితో బాధపడుతున్నానని అక్బరుద్దీన్ సోమవారం సాయంత్రం తన తరఫు న్యాయవాది ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను సమర్పించారు. దీంతో ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పోలీసులు మంగళవారం ఉదయం గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయిస్తున్నారు.

అక్బరుద్దీన్‌కు ఐదుగురు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయనకు 11 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. మధ్యాహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతానికి ఏడు పరీక్షలు నిర్వహించారు. గాంధీ ఆస్పత్రిలోని ఎంఆర్ఐ పనిచేయడం లేదని తెలుస్తోంది. దీంతో అక్బరుద్దీన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించడంలో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం.

వైద్యపరీక్షలు నిర్వహించి తర్వాత ఆయనను బంజారాహిల్స్ నివాసానికి తీసుకుని వెళ్లి వదిలేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. వైద్య పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాత అక్బరుద్దీన్ అరెస్టు విషయంలో పోలీసులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

అనారోగ్య కారణాలు చెప్పి అరెస్టును తప్పించుకోవాలని చూస్తున్న మజ్లీస్ శానససభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీని పోలీసులు మంగళవారం ఉదయం సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసు వాహనంలో అక్బరుద్దీన్ గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆక్బరుద్దీన్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించే సమయంలో దారి పొడుగునా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

తనకు ఆరోగ్యం సరిగా లేదని, విచారణకు హాజరు కావడానికి నాలుగు రోజుల వ్యవధి కావాలని అక్బరుద్దీన్ గతంలో పోలీసులను కోరారు. అయితే, అక్బరుద్దీన్ ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

English summary
Delay may be occur in conducting medical test to Akbaruddin Owaisi. MIM MLA Akbaruddin Owaisi, facing allegations of hate speech, has been shifted to Gandhi hospital in Secunderabad for medical tests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X