హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తమిళనాడు వెళ్తా: సాయిరెడ్డి, బెయిల్ ఇవ్వండి: శ్రీలక్ష్మి

By Pratap
|
Google Oneindia TeluguNews

Srilaxmi-Vijaya Sai Reddy
హైదరాబాద్: తనకు తమిళనాడు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడు విజయసాయి రెడ్డి కోర్టును కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. తమ అనుమతి లేనిదే హైదరాబాదు విడిచి వెళ్లకూడదని కోర్టు షరతులు పెట్టిన నేపథ్యంలో ఆయన ఆ పిటిషన్ దాఖలు చేశారు.

విజయసాయి రెడ్డి పిటిషన్‌పై విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. తన కూతురు వివాహం విషయంలో పురోహితుల సలహా మేరకు తమిళనాడులోని తిరునల్లూరు, వైదీశ్వరన్ కాళిక తదితర ఆలయాల్లో పూజలు చేయాలని చెబుతూ అక్కడికి వెళ్లేందుకు 11 నుంచి 20 వరకు అనుమతి ఇవ్వాలని ఆడిటర్ విజయసాయిరెడ్డి సిబిఐ కోర్టును కోరారు.

తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఒఎంసి అక్రమ మైనింగ్ కేసులో నిందితులు శ్రీలక్ష్మి, గనులశాఖ మాజీ ఎండీ రాజగోపాల్ సోమవారం నాంపల్లి సీబీఐ కోర్టును కోరారు. తనకు సిబిఐ కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ఈ నెల 20వ తేదీతో ముగుస్తుంది. దీంతో శ్రీలక్ష్మి తన న్యాయవాది ద్వారా బెయిల్ పిటిషన్ వేశారు.

అనారోగ్య కారణాలను చూపుతూ.. తనకు బెయిల్ మంజూరు చేయాలని శ్రీలక్ష్మి కోర్టును కోరారు. కాగా అనారోగ్యంతో బాధపడుతోన్న తల్లిని చూసేందుకు వెళ్లాలని, బెయిలల్ మంజూరు చేయాలని వీడీ రాజగోపాల్ కోర్టును కోరారు. ఈ కేసులను కోర్టు మంగళవారానికి వాయిదావేసింది.

English summary
Suspended IAS officer Srilakshmi, accused in Gali Janardhan Reddy's OMC case, has applied for bail in CBI court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X