వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అర్జున్ ముండా రాజీనామా: అసెంబ్లీ రద్దుకు సిఫార్సు

By Pratap
|
Google Oneindia TeluguNews

 Arjun Munda
రాంచీ: జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం ముదిరింది. ముఖ్యమంత్రి పదవికి బిజెపి నేత అర్జున్ ముండా రాజనామా చేశారు. అదే సమయంలో శాసనసభను రద్దు చేయాలని ఆయన గవర్నర్‌ సయ్యద్ అహ్మద్‌కు సిఫార్సు చేశారు. మంగళవారం ఉదయం పదకొండున్నర గంటల సమయంలో ఆయన రాజభవన్‌కు చేరుకుని తన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందించారు.

జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) మద్దతు ఉపసంహరించుకుంటూ లేఖను గవర్నర్‌కు అందించింది. దీంతో బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. తాము ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నట్లు జెఎంఎం నేత, ఉప ముఖ్యమంత్రి హేమంత్ సురేన్ గవర్నర్‌కు తెలిపారు.

మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి అర్జున్ ముండా నేతృత్వంలోని మంత్రివర్గ సమావేశం జరిగింది. శాసనసభ రద్దుకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి జెఎంఎం గైర్హాజరయింది. ఒప్పందం మేరకు నాయకత్వ మార్పునకు బిజెపి అంగీకరించకపోవడంతో జెఎంఎం ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది.

మిత్రపక్షాల నాయకత్వ మార్పు డిమాండ్‌ను ప్రధాన మిత్రపక్షమైన బిజెపి అంగీకరించలేదు. మిత్రపక్షాలతో 28 నెలల చొప్పున అధికారం పంచుకోవడానికి బిజెపి అంగీకరించింది. దాంతో ఇప్పుడు తమకు అధికారం అప్పగించాలని జెఎంఎం డిమాండ్ చేస్తోంది. గతంలో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడేందుకు బిజెపి నిరాకరించింది.

English summary

 With the Jharkhand Mukti Morcha (JMM) informing Governor Syed Ahmed that they have withdrawn support to the BJP-led government, Chief Minister Arjun Munda today recommended dissolution of the state Assembly. He reached the Raj Bhavan here around 11.30 am and submitted his resignation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X