వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెంచరీ కొట్టిన బాబు!: వంద గజాల్లో వంద ఫీట్స్ పైలాన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్/ఖమ్మం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వస్తున్నా మీకోసం పాదయాత్ర ఈ రోజు వంద రోజులకు చేరుకుంది. బాబు పాదయాత్ర మంగళవారంతో వరంగల్ జిల్లాలో పూర్తయింది. ఖమ్మం జిల్లాలో బాబు యాత్ర నిన్ననే ఎంటర్ అయింది. జిల్లాలో బాబు పాదయాత్ర ఆరు రోజులు జరుగుతుంది. బుధవారం తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం నుండి బాబు పాదయాత్ర ప్రారంభమవుతుంది.

బాబు పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకోవడంతో వంద అడుగుల పైలాన్‌ను ఏర్పాటు చేశారు. దీనిని వంద గంటల్లో, వంద గజాల్లో వంద అడుగుల ఎత్తున ఏర్పాటు చేశారు. చంద్రబాబు పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్నందుకు గుర్తుగా ఇది ఎప్పటికీ నిలిచి పోవాలనే భావనతో దీనిని నిర్మించినట్లు ఖమ్మం టిడిపి పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు దీనిని ప్రత్యేకంగా నిర్మాణ పనులు చేపట్టారు.

చంద్రబాబు అక్టోబర్ 2వ తేదిన జాతిపిత మహాత్మా గాంధీ పుట్టిన రోజునాడు తన పాదయాత్రను అనంతపురం జిల్లాలోని హిందూపురంలో ప్రారంభించారు. బాబు పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. అనంతపురం, కర్నూలు, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్, అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌ల మీదుగా చంద్రబాబు పాదయాత్ర ఖమ్మం జిల్లాకు చేరుకుంది. బాబు పాదయాత్ర టిడిపి శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకు వస్తోంది.

బాబు పాదయాత్ర వంద రోజులకు చేరడంతో రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. తమకు ఇది ఓ పండుగ దినం అని వారు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా వంద రోజుల పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు కేక్ కట్ చేశారు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu's Vastunna Meekosam Padayatra has reached 100 days on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X