వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'నాయక్' వివాదం: పేరు మార్పుకు ఎక్స్ ఎమ్మెల్యే ధర్నా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nayak
విశాఖపట్నం: రామ్ చరణ్ తేజ, కాజల్, అమలపాల్ నాయకానాయికలుగా డివివి దానయ్య నిర్మాణంలో వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన నాయక్ చిత్రంలో విలన్ పేరు మార్చాలంటూ విశాఖ జిల్లా మాజీ శాసనసభ్యుడు గండి బాబ్జీ బుధవారం ఆందోళనకు దిగారు. చిత్రంలో విలన్ పాత్రకు తన పేరును పోలిన పేరు ఉండటంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పేరును వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. ఆ పేరును ఉద్దేశ్యపూర్వకంగానే పెట్టినట్లుగా బాబ్జీ అభిప్రాయపడ్డారు.

గండి బాబ్జీ బుధవారం జిల్లాలోని పెందుర్తిలో ఆందోళనకు దిగారు. తక్షణమే పేరు మార్చాలని అతను నిర్మాతను, దర్శకుడిని కోరారు. రేపటిలోగా సినిమాలో విలన్ పాత్రధారి పేరు మార్చాలన్నాడు. లేదంటే దర్శకుడి పైన తాను క్రిమినల్ కేసు పెట్టేందుకు కూడా వెనుకాడే ప్రసక్తి లేదన్నాడు. కాగా ఇందుకు సంబంధించి గండి బాబ్జీ దర్శకుడు వివి వినాయక్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లుగా సమాచారం. వినాయక్ సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

కాగా రామ్ చరణ్ తేజ హీరోగా, కాజల్, అమలపాల్ హీరోయిన్లుగా నటించిన నాయక్ చిత్రం ఈ రోజు విడుదలయిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విలన్ పాత్రధారి రాహుల్ దేవ్ పేరును గండిపేట బాబ్జిగా చూపించారు. అతనో డాన్. సినిమాలోని గండిపేట బాబ్జీ పేరు, ఆందోళన చేపట్టిన గండి బాబ్జీ పేర్లు దగ్గరగా ఉన్నాయి.

ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ఫరవాలేదనే టాక్ తెచ్చుకుంది. ఎంతో ఎనర్జీతో పాటలు, ఫైట్స్ చేసుకుంటూ పోయినా కథ, కథనంలో ఎక్కడా మచ్చుకు కూడా ప్రెష్ నెస్ లేకపోవడంతో అతని శ్రమకు తగ్గ సినిమాగా కనపడటం లేదంటున్నారు. ఈ సినిమాలో తన తండ్రి చిరంజీవి 'కొండవీటి దొంగ' సినిమాలోని 'శుభలేఖ రాసుకొన్నా' అనే గీతాన్ని మాత్రమే రీమిక్స్‌ చేశారు. అంతేకాకుండా పలు సీన్స్ కూడా అంతకు ముందు వచ్చిన చిత్రాల మిక్స్ లా అనిపిస్తున్నాయని అంటున్నారు.

English summary
Former Vishakapatnam district MLA Gandi Babji demanded Nayak film director to change the villain name.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X