వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పదేళ్ల తర్వాత పెరిగిన రైలు ఛార్జీలు: 21 నుండి అమలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rail travel gets costlier as fares hiked by upto 20%
న్యూఢిల్లీ: రైలు ఛార్జీలను స్వల్పంగా పెంచుతున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సాల్ బుధవారం తెలియజేశారు. పదేళ్ల కాలంలో రైలు ఛార్జీలు పెరగటం ఇదే తొలిసారి. తాజాగా పెంచిన ధరలు ఈ నెల 21వ తేది నుండి అమలులోకి వస్తాయి. దాదాపు టిక్కెట్ పైన ఇరవై శాతం పెంచారు. రైల్వేలో భద్ర, పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తామని పవన్ కుమార్ బన్సాల్ మీడియా సమావేశంలో చెప్పారు.

రైలు ఛార్జీల పెంపుతో రైల్వేకు ఆరువేల ఆరువందల కోట్ల రూపాయల ఆదాయం రానుందని భావిస్తున్నారు. అన్ని తరగతులకూ ధరలు పెంచారు. సామాన్య తరగతి ప్రయాణీకులపై స్వల్పంగానే భారం వేసింది. ధరల పెంపు ద్వారా వచ్చిన మొత్తాన్ని పరిశుభ్రత, భద్రతకే ఉపయోగిస్తామని కేంద్రమంత్రి చెప్పారు.

2004-05లో ఏడాదిలో రైల్వే శాఖకు రూ.6,159 కోట్ల నష్టం వచ్చిందని పవన్ కుమార్ బన్సాల్ తెలిపారు. 2010-11లో అది రూ.19,964 కోట్లకు పెరిగిందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఇది రూ.25వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా ఉన్నట్లు ఆయన తెలిపారు. అనివార్య పరిస్థితుల కారణంగానే ఛార్జీలు పెంచామన్నారు. ప్రతి టిక్కెట్ పైన డెవలప్‌మెంట్ ఛార్జ్ రూ.5 వసూలు చేయనున్నారు.

పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి...

రెండో తరగతి ఆర్డినరీ సబర్బన్ - కిలోమీటర్‌కు 2 పైసలు
రెండో తరగతి ఆర్డీనరీ నాన్ సబర్బన్ - కిలోమీటర్‌కు 3 పైసలు
రెండో తరగతి మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైలు - కిలోమీటర్‌కు 4 పైసలు
స్లీపర్ క్లాస్ - కిలోమీటర్‌కు 10 పైసలు
ఎసి చైర్ కార్ - కిలోమీటర్‌కు 10 పైసలు
ఎసి 2 టైర్ - కిలోమీటర్‌కు 6 పైసలు(ఇంతకుముందు 15 పైసలు పెరిగింది)
ఎసి ఫస్ట్ క్లాస్ - కిలోమీటర్‌కు 3 పైసలు(ఇంతకుముందు 10 పైసలు పెరిగింది)
ఎసి ఫస్ట్ క్లాస్ స్లీపర్ - కిలోమీటర్‌కు 30 పైసలు

English summary
In the first hike in ten years, Union Railways Minister Pawan Kumar Bansal on Wednesday increased passenger fares by upto 20 percent across the board. The new fare will be effective from January 21 midnight. Indian Railways is looking to raise Rs 6,600 crore through the fare hike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X