వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి బిజినెస్‌తో నాకు సంబంధమేంటి: అలీఖాన్ పిటిషన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ALi Khan
హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి వ్యాపారాలతో తనకేం సంబంధమని గాలి వ్యక్తిగత కార్యదర్శి అలీ ఖాన్ చెప్పాడు. తాను గాలి పిఏని కాదని, ఒక వ్యాపారినని అతను సిబిఐ కోర్టుకు తెలిపాడు. తనకు బెయిల్ ఇవ్వాలని అలీ ఖాన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను పిఏను అన్నది సిబిఐ సృష్టించిన కథ అని ఆరోపించాడు. రూ.50 కోట్ల వ్యాపారం నిర్వహిస్తూ లక్షలు గడించే తనకు వ్యక్తిగత సహాయకుడిగా జీతానికి చేరాల్సిన అవసరం లేదన్నాడు.

ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న గాలి లాంటి వ్యక్తికి ఏ రంగంలోనూ అనుభవం లేని తనను సహాయకుడిగా చేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదన్నాడు. గాలి కూడా ఎక్కడా తనను ఆయనకు పిఏగా చెప్పలేదన్నాడు. 2009లో సిబిఐ కేసు నమోదు చేసినా ఇప్పటి వరకు ఆధారాలు సేకరించలేదని, ఓఎంసితో తనకు ఎలాంటి సంబంధం లేదని, సిబిఐ మెమోలో తనకు వ్యతిరేకంగా ఎక్కడా జ్యూడిషియల్ రిమాండు సమయంలో సిబిఐ పేర్కొనలేదని చెప్పాడు.

శ్రీనివాస రెడ్డిని జైల్లో విచారించిన కర్నాటక అధికారులు

ఓఎంసి కేసులో అరెస్టై చంచల్‌గూడ జైల్లో ఉన్న శ్రీనివాస రెడ్డిని మంగళవారం కర్నాటక బెల్గాంకు చెందిన డిజి సిఈఐ అధికారులు విచారించారు. ఓఎంసి ఎండిగా ఉన్న సమయంలో శ్రీనివాస్ రెడ్డి కోట్లాది రూపాయల సర్వీస్ పన్ను కట్టకుండా ఎగ్గొట్టారనే అభియోగంపై విచారణ చేపట్టారు. మూడు రోజులు విచారించేందుకు కోర్టు కర్నాటక అధికారులకు అనుమతించింది. బుధవారం కూడా విచారించనున్నారు.

English summary
I am not gali Janardhan Reddy's PA said ALi Khan, co accused in the illegal mining case, in the bail petition filed by him in the CBI special court on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X