ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్బరుద్దీన్: కస్టడీపై కౌంటర్, ప్రత్యేక ఖైదీ కోసం పిటిషన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Akbaruddin Owaisi
అదిలాబాద్/హైదరాబాద్: మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీని తమ కస్టడీకి ఇవ్వాలన్న అదిలాబాద్ జిల్లా పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పైన అక్బర్ తరఫు న్యాయవాదులు గురువారం కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం నిర్మల్ కోర్టు కస్టడీ పిటిషన్ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. న్యాయస్థానం తీర్పును బట్టి అక్బరుద్దీన్ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి.

మజ్లిస్ తరఫు న్యాయవాదులు ఈ రోజు మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీని ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని మజ్లిస్ తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ప్రత్యేక గది, ఆహారం ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. దీని పైన కూడా విచారణ రేపు జరగనుంది.

హైదరాబాదుకు తీసుకు వచ్చే ప్రయత్నం

వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టై అదిలాబాదు సబ్ జైలులో ఉన్న మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీని హైదరాబాదుకు తీసుకు వచ్చేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయ పోలీసులు యోచిస్తున్నారు. ఆయనను పిటి వారెంటు పైన నగరానికి తీసుకు వచ్చి కస్టడీకి కోర్టు అనుమతిని కోరనున్నారు.

అక్బరును హైదరాబాదుకు తరలించేందుకు న్యాయపరమైన అంశాలపై ఉస్మాయని పోలీసులు న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. అదే విధంగా అక్బరుద్దీన్ ప్రసంగాన్ని ప్రసారం చేసిన టెలివిజన్ ఛానళ్లకు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నట్లుగా సమాచారం. ఛానళ్లకు నోటీసులు ఇచ్చి ప్రసంగ వివరాలను తీసుకోనున్నారు.

English summary

 MIM Party lawyers filed counter petition in Nirmal court on Thursday against police custody petition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X