వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎం పోస్టుకు ఎసరు: శాపగ్రస్త జిల్లాకు జగదీష్ శెట్టార్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jagadish Shetta
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి జగదీష్ శెట్టార్ మూడనమ్మకాలకు తెరదించే ప్రయత్నాలు చేశారు. తన పదవికి మాజీ ముఖ్యమంత్రి, కర్నాటక జనతా పార్టీ అధ్యక్షుడు బిఎస్ యడ్యూరప్ప ఎసరు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన మూఢ నమ్మకాలకు తెరదించే ప్రయత్నాలు చేయడం గమనార్హం. చామరాజునగర్‌కు వెళితే ముఖ్యమంత్రి అధికారం కోల్పోతారని ప్రచారం ఉంది.

ఫలితంగా ఐదేళ్ల నుంచి ఏ ముఖ్యమంత్రి అక్కడ పర్యటించలేదు. కర్ణాటకలో శాపగ్రస్త జిల్లాగా పేరుగాంచిన చామరాజనగర్‌కు మూఢ నమ్మకాన్ని పక్కన పెట్టి మరీ జగదీశ్ శెట్టర్ విచ్చేశారు. బెంగళూరు నుంచి బుధవారం మలై మహదేశ్వర కొండకు హెలికాప్టర్ ద్వారా చేరుకుని మహదేశ్వరుడికి పూజలు నిర్వహించి, చామరాజనగర్ చేరుకున్నారు. ఆయన మొరార్జీ వసతి పాఠశాల, ప్రైవేట్ బస్‌స్టేషన్, కమర్షియల్ కాంప్లెక్స్, సమాచార భవనం, పశువైద్యశాల, నవోదయ విద్యాలయంలో విశ్రాంతి భవనం, బయోగ్యాస్ విభాగంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

పలు శంకుస్థాపనలు చేశారు. గతంలో 2008 మేలో అప్పటి సిఎం హెచ్‌డి కుమార స్వామి చామరాజనగర్‌ను సందర్శించారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగడంతో చామరాజనగర్‌పై మూఢనమ్మకానికి మరింత ఊతమిచ్చినట్లయింది. గతంలో రామకృష్ణ హెగ్డే, ఎస్.ఆర్.బొమ్మై, వీరేంద్ర పాటిల్ చామరాజనగర్ జిల్లాలో పర్యటించారు. తర్వాత ఐదారు నెలల్లోనే వారంతా పదవులను కోల్పోయారు.

మహదేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం జగదీశ్ శెట్టర్ విలేకరులతో మాటాడారు. స్వామి ఆశీర్వాద బలంతో తమ ప్రభుత్వం ఐదేళ్ల కాలపరిమితిని పూర్తి చేసుకుంటుందనే ధీమా వ్యక్తం చేశారు. చామరాజనగర్ పుణ్యభూమి అని, తాను మంత్రిగా ఉన్న కాలంలో పలుమార్లు ఇక్కడికి వచ్చినట్టు గుర్తు చేసుకున్నారు.

English summary

 Karnataka CM Jagadish Shetter was visited the jinxed Chamarajnagar on Wednesday and make special pooja to Mahadeshwara Swamy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X