వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తలల నరికివేత: కొడుకునూ ఆర్మీలోకి పంపిస్తానన్నతల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Martyr Lance Naik Hemraj cremated with military honours
న్యూఢిల్లీ/జమ్మూ: పాకిస్తాన్ సైనికుల పాశవిక చర్యకు బలైన భారత అమర సైనికుల స్వగ్రామాల్లో బుధవారం విషాదం అలముకుంది. హేమరాజ్, సుధాకర్ సింగ్‌ల భౌతిక కాయాలు త్రివర్ణ పతాకం చుట్టిన శవపేటికలలో ఇళ్లకు చేరాయి. హేమరాజ్ ఉత్తర ప్రదేశ్‌లోని ఖైరాడ్ గ్రామవాసి. రాత్రి పొద్దు పోయాక అతని అంత్యక్రియలు పూర్తి చేశారు. హేమరాజ్ చితికి తనయుడు నిప్పు పెట్టారు. ప్రిన్స్‌ను కూడా సైన్యంలోకి పంపుతామని, తండ్రిని చంపిన పాక్ సైనికులపై మా వాడు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాడని హేమరాజ్ భార్య ధర్మావతి, తల్లి మీనా చెప్పడం విశేషం.

హేమరాజ్ 2001లో ఆర్మీలో చేరారు. భార్య, తల్లి, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు(ప్రిన్స్), ఇద్దరు సోదరులతో కలిసి ఉంటున్నాడు. తండ్రి రెండేళ్ల క్రితం చనిపోయాడు. హేమరాజ్ చనిపోవడంతో ఆ కుటుంబం ధైర్యంగా పాక్ సైనికులను తుదముట్టించేందుకు ప్రిన్స్‌ను కూడా ఆర్మీలోకి పంపిస్తామని చెప్పడం గమనార్హం. ప్రిన్స్ వయస్సు ప్రస్తుతం ఐదేళ్లు. ఇక సుధాకర్ సింగ్ మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లా దర్హియా గ్రామస్థుడు.

ఇతను 2002లో ఆర్మీలో చేరారు. వీరిద్దరూ 13 రాజ్ పుటానా రైఫిల్స్ దళానికి చెందిన జవాన్లు. హేమరాజ్, సుధాకర్ సింగ్‌ల మృతదేహాలను తొలుత పూంచ్ జిల్లా నుంచి రాజౌరికి సైనిక లాంఛనాలతో తరలించారు. అక్కడి నుండి హెలికాప్టర్‌లో జమ్మూ విమానాశ్రయానికి, అక్కడి నుండి ఢిల్లీకి తరలించారు. కాగా సుధాకర్ సింగ్ తల ఇంకా దొరకలేదు. సుధాకర్ సింగ్‌కు భార్య, నాలుగు నెలల కుమారుడు ఉన్నారు.

ఆధారాలున్నాయి

భారత జవాన్ల పైన తాము దాడి చేయలేదన్న పాకిస్తాన్ వ్యాఖ్యల్ని రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోనీ తోసిపుచ్చారు. ఇద్దరు జవాన్లను హతమార్చి, మృతదేహాలను ఛిన్నాభిన్నం చేయడం వెనుక పాక్ హస్తమున్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అమానవీయంగా ప్రవర్తించిందని మండిపడ్డారు. భారత్‌ను రెచ్చగొట్టేందుకే ఈ దారుణానికి పాల్పడుతోందన్నారు. మరోవైపు అది తమ పని కాదని పాకిస్తాన్ కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తోంది.

English summary

 Lance Naik Hemraj, one of the two soldiers brutally killed by Pakistani troops in J&K, was cremated tonight with full military honours at his native village Khairar amid chanting of 'Hemraj Amar Rahen'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X