హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణవాదినికాదు, సాక్షి తప్పు:కొండ్రు, తెరాసపై గోనె

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gone Prakash Rao-Kondru Murali
హైదరాబాద్/విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దిన పత్రిక రాంకీ ఆస్తులను ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడి) జప్తు చేయడంపై విష ప్రచారం చేస్తోందని మంత్రి కొండ్రు మురళీ మోహన్ విశాఖపట్నంలో అన్నారు. రాంకీ సంస్థ ఎకరం రూ.మూడ లక్షల చొప్పున ఏడువందల ఎకరాలను చౌకగా కొటటి వేసిందని ఆయన ధ్వజమెత్తారు.

అయితే రాంకీకి నష్టం జరిగినట్లుగా సాక్షిలో కథనాలు వచ్చాయని విమర్శించారు. తనను తెలంగాణవాది అని సాక్షి తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. తాను ముమ్మాటికీ సమైక్యవాదినే అని అన్నారు. మెజార్టీ ప్రజలు సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని, తాను ప్రజల అభిప్రాయం మేరకే నడుచుకునే వ్యక్తిని అన్నారు. విభజన విషయంలో కేంద్రం త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

కెసిఆర్ మౌనం ఎందుకో?

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గోనె ప్రకాశ రావు హైదరాబాదులో మండిపడ్డారు. తెలంగాణ ప్రాంతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి వస్తున్న ప్రజాదరణ తెరాస నేతలకు కంటగింపుగా మారిందన్నారు. మజ్లిస్ పార్టీకి, తమ పార్టీకి లేని సంబంధాన్ని అంటగట్టేందుకు తెరాస ప్రయత్నాలు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

తెలంగాణపై ఏర్పాటు పైన చిత్తశుద్ధి లేని తెరాస అనవసర ఆరోపణలకు దిగుతోందన్నారు. జాగో బాగో అన్న కెసిఆర్ ఇప్పుడు ఫాంహౌస్‌లో ఎందుకు ఉన్నారో చెప్పాలన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని నోటికొచ్చినట్లు విమర్శించిన కేసిఆర్ ఇప్పుడు మౌనంగా ఉండటానికి గల కారణమేంటని ప్రశ్నించారు. తెలంగాణ ఇప్పట్లో రాదని కెసిఆర్ చెబుతుంటే దానిని జగన్ అడ్డుకోవడం ఎలా సాధ్యమో చెప్పాలన్నారు.

English summary
Minister Kondru Murali Mohan said on Friday at Vishakapatnam that he is not telanganite.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X