హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జైలుకు సుమన్ రాథోడ్: యరపతనేనికి నో బెయిల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Suman Rathode
హైదరాబాద్: భుకబ్జా కేసులో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు సుమన్ రాథోడ్ శుక్రవారం మియాపూర్ కోర్టులో లొంగిపోయారు. ముందస్తు బెయిల్ కోసం ఆమె సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. అయితే, బెయిల్ లభించలేదు. దీంతో కోర్టులో లొంగిపోయారు. ఆమెపై అరెస్టు వారంట్ ఉంది. ఈ కేసులో ఇప్పటికే ఖాన్, దుర్గారాజు అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. సుమన్ రాథోడ్‌కు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో ఆమెను హైదరాబాదులోని చంచల్‌గుడా జైలుకు తరలించారు.

హైదరాబాదులోని కెపిహెచ్‌బి కాలనీలో ఆరో ఫేజ్‌లో సుమన్ రాథోడ్ మరికొంత మందితో కలిసి 400 గజాల భూమిని అక్రమంగా ఆక్రమించుకుని ఇతరులకు విక్రయించడానికి ప్రయత్నించారని ఆరోపణలు రావడంతో కేసు నమోదైంది. ఈ కేసులో ఆమె ప్రథాన నిందితురాలు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, ఆ భూమిని ఇతరులకు విక్రయించడానికి సుమన్ రాథోడ్ మరికొంత మందితో కలిసి అమ్మడానికి ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి.

కాగా, హత్య కేసులో చిక్కుకున్న మరో తెలుగుదేశం పార్టీ శానససభ్యుడు యరపతనేని శ్రీనివాస రావు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను గుంటూరు జిల్లా కోర్టు కొట్టేసింది. కాంగ్రెసు కార్యకర్త నరేంద్ర హత్య కేసులో కుట్రదారుడిగా ఆయనపై కేసు నమోదైంది. ఆయనను పోలీసులు బుధవారంనాడు హైదరాబాదులో అరెస్టు చేశారు.

ఇదిలావుంటే, వారం రోజుల్లో ఐదుగురు శాసనసభ్యులపై కేసులు నమోదయ్యాయి. వీరిలో నలుగురు తెలుగుదేశం పార్టీకి చెందినవారే. సుమన్ రాథోడ్, యరపతనేనిలపై నమోదైన కేసులు తీవ్రమైనవి. ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీని ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ ఎస్‌ఇ కార్యాలయంపై దాడి చేశారనే ఆరోపణపై ఇద్దరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన శానససభ్యులు సుద్దాల దేవయ్యకు, విజయరామారావుకు బెయిల్ లభించింది.

English summary
Telugudesam MLA Suman Rathode has surrendered in Miyapur court in a land grabbing case. Meanwhile, MLA Yarapathaneni Srinivas Rao has been denied bail in a murder case by Guntur district court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X