వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలయ్య కార్యక్రమంలో జగన్‌ఎమ్మెల్యే: తమ్ముళ్ల టెన్షన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Balakrishna
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ ఈ నెల 14వ తేదిన చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఆయన తన పర్యటనలో తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆయన విగ్రహంతోపాటు మాజీ పార్లమెంటు సభ్యుడు రామకృష్ణా రెడ్డి విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తారు. ఈ నెల 14న రామకృష్ణా రెడ్డి జయంతి.

ఈ సందర్భంగా ఆయన చిన్న కుమారుడు, స్థానిక టిడిపి నేత శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. వీటిని బాలకృష్ణ ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున 2009లో గెలుపొందారు. ఇటీవలె ఆయన టిడిపి పైన, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్ర విమర్శలు చేసి వైయస్సార్ కాంగ్రెసు గూటికి చేరుకున్నారు.

అమర్నాథ్ రెడ్డి.... శ్రీనాథ్ రెడ్డి కుటుంబానికి చెందిన వ్యక్తి. కాబట్టి ఆయన కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే పార్టీని, పార్టీ అధినేతను తీవ్రంగా విమర్శించి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపుకు వెళ్లిన అతను పాల్గొంటే తెలుగు తమ్ముళ్లు అసంతృప్తికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. అమర్‌నాథ్‌ రెడ్డి కార్యక్రమానికి హాజరైతే బాలకృష్ణతో పాటు వేదిక పంచుకుంటారు.

చంద్రబాబును తీవ్రంగా విమర్శించి నెల రోజుల క్రితమే జగన్ పార్టీ వైపుకు చేరిన అమర్నాథ్ రెడ్డి ఇప్పుడు బాలకృష్ణ పాల్గొనే కార్యక్రమంలో ఉంటే కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఆందోళన నేతల్లో వ్యక్తమవుతోంది. అమర్‌నాథ్‌ రెడ్డికి ఎలా ఉన్నా ఒకే వేదికపై ఉండటాన్ని సాకుగా తీసుకుని తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కలిసిపోయాయని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తే ఏం సమాధానం చెప్పాలని తెలుగుతమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారట.

English summary
YSR Congress Party MLA Amarnath Reddy may participate in Hero and Telugudesam Party leader Nandamuri Balakrishna's programme on 14th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X