హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్బర్ అరెస్ట్ ఆలస్యం: సయీద్ కోసం ఒత్తిడిపై ప్రశ్నలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: హిందువుల పైన, హిందూ దేవతల పైన మాత్రమే కాకుండా జాతి విభేదాలు సృష్టించే విధంగా మాట్లాడిన మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ అరెస్టు చేసేందుకే మనకు మూడు వారాలు పట్టిందని, అలాంటప్పుడు లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది హఫీజ్ సయిద్‌ను వెంటనే అరెస్టు చేయమని పాకిస్తాన్‌ను గట్టిగా ప్రశ్నించే నైతిక అర్హత మనకు ఉందా అని వాదనలు వినిపిస్తున్నాయి.

26/11 దాడులతో పాటు ఇటీవల ఎల్‌వోసీ వద్ద జవాన్లపై దుశ్యర్యలో హఫీజ్ సయీద్ పాత్ర ఉందనే అభియోగాలు ఉన్నాయి. భారత్‌ను టార్గెట్‌గా పెట్టుకున్న హఫీజ్ సయీద్‌ను అరెస్టు చేసి ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. కానీ మన దేశంలోనే జాతి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్న వారి పట్ల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు. అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు సాదా సీదావి కావని అంటున్నారు.

భారత దేశంలో పరమత సహనం ఉండాలి. అయితే అక్బర్ దానిని పట్టించుకోకుండా హిందూ చరిత్ర పుటల్లోకి వెళ్లి విమర్శలు గుప్పించాడు. దానికి పలువురు స్వామీజీలు ధీటుగా పలు సందర్భాలలో సమాధానమిచ్చారు. అయితే అక్బర్ చేసిన వ్యాఖ్యలు తీవ్రాతితీవ్రమైనవని ఆయా రాజకీయ పార్టీ నేతల ఎదురుదాటి వల్లనే స్పష్టంగా అర్థమవుతోంది. అంతటి దారుణ వ్యాఖ్యలు చేసిన అక్బరును అరెస్టు చేసేందుకు అన్ని రోజులు ఎందుకు పట్టిందనేది సామాన్యుల ప్రశ్న.

Akbaruddin Owaisi

దేశంలోనే ఉండి జాతి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్న ఇలాంటి వారి పట్లనే ఇంత నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు సయీద్ కోసం మనం గట్టిగా ఎలా పట్టుపట్టగలమని ప్రశ్నిస్తున్నారు. అక్బర్ మాత్రమే కాదని ఇతర మతాల పట్ల విపరీత వ్యాఖ్యలు చేసే వారెవరైనా వారిపై చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నారు. అదే సమయంలో అక్బరుద్దీన్, సయీద్‌ల అంశాలు వేరు అని, దానికి దీనికి సంబంధం లేదని మరికొందరు అంటున్నారు.

అయితే అక్బరుద్దీన్ అరెస్టు ఆలస్యం పైన డిజిపి దినేష్ రెడ్డి ఇప్పటికే వివరణ ఇచ్చారు. ఉర్దూ ట్రాన్సులేట్ చేసుకొని, వాటిని పరీక్షించినందు వల్లనే ఆలస్యమయిందని దినేష్ రెడ్డి మీడియా సమాక్షంలో వారు రోజుల క్రితం చెప్పారు.

English summary
People are asking India, if you take 3 weeks to arrest one Akbaruddin Owaisi, how dare you ask Pakistan to arrest Hafiz Saeed right now?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X