అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరిటాల ఫ్యామిలీకి దగ్గర కాబట్టే: ఎమ్మెల్యే కందికుంట

By Pratap
|
Google Oneindia TeluguNews

Anantapur
అనంతపురం: కాంగ్రెస్ నాయకుడు కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి హత్య కుట్ర కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడైన నాగూర్ హుస్సేన్‌కు అనంతపురం జిల్లా కదిరి తెలుగుదేశం శానససభ్యుడు కందికుంట వెంకటప్రసాద్ ఆశ్రమిచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆయనను విచారిస్తామని ధర్మవరం డిఎస్పీ నవాజ్ ఖాన్ చెప్పారు.

పోలీసుల తీరుపై కందికుంట వెంకటప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. నాగూర్ హెస్సేన్‌తో తనకు పరిచయం ఉందని, అయితే చాలా రోజులుగా హుస్సేన్‌తో మాట్లాడలేదని ఆయన శనివారం అన్నారు. పరిటాల కుటుంబానికి తాను సన్నిహితుడ్ని కాబట్టే తనను లక్ష్యం చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఫాక్షన్‌ను పురికొల్పే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.

ధర్మవరం శాసనసభ్యుడు వెంకట్రామిరెడ్డి, పెద్ది రెడ్డి కుట్ర కారణంగానే తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అనంతపురం జిల్లాలో బాబాయి, అబ్బాయిల కుట్రలకు తాను బలి కావాలా అని ఆయన అడిగారు. పోలీసుల విచారణకు తాను సహకరిస్తానని ఆయన చెప్పారు. శ్రీరామ్‌పై కేసులు పెడితే శానససభ్యురాలు సునీత ఎంతగా బాధపడుతారో తనపై కేసు పెట్టినా అంతే బాధపడుతారని ఆయన అన్నారు.

కామిరెడ్డి సుధాకర్ రెడ్డి హత్య కుట్ర కేసులో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌తో పాటు 15 మందిపై పోలీసులు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో పరిటాల శ్రీరామ్‌కు బెయిల్ లభించింది. పరిటాల శ్రీరామ్‌పై చార్జిషీట్ తెరుస్తామని కూడా పోలీసులు చెప్పారు.

English summary
Telugudesam MLA Kandikunta Venkat Prasad denied his involvement in Sudhakar Reddy's murder conspiracy case. Anantapur district Dharmavaram DSP Nawaz Khan said that rowdy sheets will be opened on Paritala Sriram along with 14 others, accused in Congress leader Kamireddpalli Sudhakar Reddy's murder conspiracy case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X