వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్బర్ ఇష్యూ: రాఘవులు సంచలనం, పయ్యావులదీ..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Raghavulu - Payyavula Keshav
హైదరాబాద్: మజ్లిస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ అంశంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగం ఎప్పుడూ మైనార్టీలకు వ్యతిరేకంగా ఉందని, వారికి న్యాయం జరగాలంటే రాజ్యాంగం కంటే మన శక్తినే నమ్ముకోవాలని సూచించారు. ముస్లింలను రెచ్చగొట్టేలా మాట్లాడిన అక్బరుద్దీన్ ఓవైసి అరెస్టు సబబే అని ఆయన అన్నారు. అక్బరును అరెస్టులో ఎలాంటి తప్పు లేదన్నారు.

అయితే హిందువులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించిన ప్రవీణ్ తొగాడియా విషయమేమిటని ఆయన ప్రశ్నించారు. ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న తొగాడియాను ఎందుకు అరెస్టు చేయడం లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి ఆలయం చరిత్ర అరవయ్యేళ్లది అన్నారు. ప్రభుత్వాలు నిత్యం మైనార్టీలను వేధిస్తూనే ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మతం పేరుతో రాజకీయం

కాంగ్రెసు ప్రభుత్వం మతం పేరుతో రాజకీయం చేస్తూ.. హిందూ ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు అయన అరెస్టు సరైనదే అన్నారు. అయితే ఆయనపై ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోవడాన్ని ఆయన ప్రశ్నించారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలు సమర్థనీయం కాదన్నారు. ప్రభుత్వం చర్యలు ఆయన వ్యాఖ్యల కంటే ప్రమాదకరంగా ఉన్నాయన్నారు.

కాంగ్రెసు పార్టీకి మద్దతిచ్చినప్పుడు అక్బరుద్దీన్ పైన ఎన్ని కేసులు పెట్టారని ప్రశ్నించారు. అక్బరుద్దీన్ విషయంలో బిజెపి - కాంగ్రెసు కుట్ర చేశాయన్నారు. అక్బరు విషయంలో ప్రభుత్వ చర్యలు సరిగా లేవన్నారు. మైనార్టీలను ఆదుకుంది టిడిపియే అన్నారు. బాబు తొమ్మిదేళ్ల పాలనలో హైదరాబాదులో ఎలాంటి హింస చోటు చేసుకోలేదన్నారు. అక్బరుద్దీన్ పైన కేసు పెట్టిన కాంగ్రెసు తొగాడియాను ఎందుకు అరెస్టు చేయట్లేదన్నారు.

English summary
CPM Raghavulu and Telugudesam Party leader Payyavula Keshav questioned Congress party about MIMLP Akbaruddin Owaisi arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X