• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సుమన్‌కు షరతులతో బెయిల్: వేధింపులన్న రమేష్

By Srinivas
|

Suman Rathode
హైదరాబాద్: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఓ స్థలానికి సంబంధించిన కేసులో అదిలాబాద్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఖానాపూర్ శాసనసభ్యుడు సుమన్ రాథోడ్‌కు శనివారం బెయిల్ లభించింది. మియాపూర్ కోర్టు న్యాయమూర్తి ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. న్యాయమూర్తి సత్యనారాయణ ప్రతి శనివారం ఆమె కోర్టులో హాజరు కావాలని ఇరవై రోజుల పాటు ప్రతి రోజు కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలనే షరతుపై బెయిల్ మంజూరు చేశారు.

కాగా అంతకుముందు చంచల్‌గూడ మహిళా జైలులో రిమాండ్‌లో ఉన్న సుమన్ రాథోడ్‌ను కూకట్‌పల్లి పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ కేసులో ఎమ్మెల్యే లొంగిపోవడంతో శుక్రవారం రాత్రి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఎమ్మెల్యేను తదుపరి విచారణకు కోర్టు ఒక రోజు అనుమతి ఇవ్వడంతో ఉదయం కూకట్‌పల్లి పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించి తిరిగి జైలుకు తరలించారు.

హైదరాబాదులోని కెపిహెచ్‌బి కాలనీలో ఆరో ఫేజ్‌లో సుమన్ రాథోడ్ మరికొంత మందితో కలిసి 400 గజాల భూమిని అక్రమంగా ఆక్రమించుకుని ఇతరులకు విక్రయించడానికి ప్రయత్నించారని ఆరోపణలు రావడంతో కేసు నమోదైంది. ఈ కేసులో ఆమె ఎ4 నిందితురాలు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, ఆ భూమిని ఇతరులకు విక్రయించడానికి సుమన్ రాథోడ్ మరికొంత మందితో కలిసి అమ్మడానికి ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి.

వేధింపులు

తన భార్యను అక్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేసులో ఇరికించిందని సుమన్ నాథోడ్ భర్త ఎంపి రమేష్ రాథోడ్ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను వేధించటమే పనిగా పెట్టుకొని ఆ పార్టీ నాయకులు కట్ర చేస్తున్నారని విమర్శించారు.

English summary
Adilabad district Khanapur Telugudesam party MLA 
 
 Suman Rathode get bail on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X