ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిడి చూపిస్తూ3గం.అక్బర్ విచారణ: చలాకిగా,నవ్వుతూ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Akbaruddin Owaisi
అదిలాబాద్: మజ్లిస్ పార్టీ శాననసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీని నిర్మల్ పోలీసులు ఆయన ప్రసంగ సిడిని అతని ముందు ఉంచి ప్రశ్నించారు. ల్యాప్‌టాప్‌లో అతని ప్రసంగ సిడిని ఉంచి ఆ ఘటనపై పోలీసులు అతనిని దాదాపు మూడు గంటల పాటు తొలిరోజు ప్రశ్నంచారు. ఆదిలాబాద్ ఏఆర్ హెడ్‌ క్వార్టర్స్‌లో అక్బరుద్దీన్ విచారణ జరిగింది. కేసు విచారణాధికారి, నిర్మల్ రూరల్ సిఐ రఘు, ఎస్సై శ్రీనివాస్‌లు శనివారం ఉదయం జైలు నుండి అక్బర్‌ను రిమాండులోకి తీసుకున్నారు.

జైల్లోనే రిమ్స్ వైద్య బృందం అక్బర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనం, భారీ బందోబస్తు మధ్య అక్బరును ఏఆర్ హెడ్ క్వార్టర్‌కు తరలించారు. ఆయన న్యాయవాదుల సమక్షంలోనే వివిధ కోణాల్లో అక్బర్‌ను ప్రశ్నించారు. ఈ విచారణలో ఉట్నూరు ఏఎస్‌పీ, నిర్మల్ ఇన్‌చార్జి డిఎస్పీ అంబర్ కిషోర్ ఝా, కేసు విచారణాధికారి, నిర్మల్ రూరల్ సిఐ రఘు, బెల్లంపల్లి డిఎస్పీ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.

మధ్యాహ్నం అక్బర్‌కు రోటీ, అన్నం, కూర, పప్పుతోపాటు జ్యూస్ అందించారు. రాత్రి పడుకునేందుకు ఏఆర్ హెడ్ క్వార్టర్‌లోనే ప్రత్యేక గదిని కేటాయించారు. కాగా పోలీసు విచారణకు వెళ్లే సమయంలో అక్బరుద్దీన్ చలాకీగా, నవ్వుతూ కనిపించారు. బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో వాహనం జైలు బయటకు రాగానే అప్పటికే అక్కడ ఎదురు చూస్తున్న మజ్లిస్ ఎమ్మెల్యే అఫ్సర్‌ఖాన్, ఇతర నాయకులను చూసిన అక్బరుద్దీన్ నవ్వుతూ చేతితో అభివాదం చేశారు.

కాగా అక్బరుద్దీన్‌ను పోలీస్ కస్టడీకి ఇస్తూ కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో ఎక్కడ విచారించాలో, ఎన్ని గంటలు విచారించాలనే వివరాలు స్పష్టంగా లేవని కార్వాన్ ఎమ్మెల్యే అఫ్సర్‌ఖాన్ అన్నారు. జైల్లో సౌకర్యాలు సరిగా లేవని విమర్శించారు. గతంలో ఆపరేషన్ అయినందున అక్బరుద్దీన్ కడుపు నొప్పితో బాధ పడుతున్నారని, కనీసం పడుకోవడానికి బెడ్ ఏర్పాటు చేయాలని కోరారు.

English summary
Nirmal police on Saturday assumed custody of MIM MLA
 
 Akbaruddin Owaisi following grant of a five-day
 
 police custody by Nirmal Judicial First Class
 
 Magistrate K. Ajesh Kumar the previous day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X