హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీలో తెలంగాణ చిచ్చు: గుర్నాథ్ వర్సెస్ కెకె

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gurunath Reddy-KK Mahender Reddy
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తెలంగాణ చిచ్చు రగిలింది. గత నెల 28న అఖిల పక్ష సమావేశంలో పార్టీ ఓ నిర్ణయాన్ని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు ఇచ్చింది. అయితే ఈ రోజు అనంతపురం జిల్లా జగన్ పార్టీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వ్యక్తిగతంగా రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తానన్నారు.

తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విభజిస్తే ప్రత్యేక సీమ కావాల్సిందే అన్నారు. విభజన జరగకుండా ఉండటానికి అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమన్నారు. తెలంగాణపై పార్టీ అభిప్రాయం, తన అభిప్రాయం వేరన్నారు. మంత్రి గంటా స్రీనివాస రావు సమైక్యాంధ్ర సమావేశానికి ఆహ్వానిస్తే తాను వెళ్తానని చెప్పారు. కొందరు స్వార్థపూరిత నేతలు తెలంగాణ వచ్చిందని, తీసేసుకున్నామన్నట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

కేంద్రం నిర్ణయానికి కట్టుబడటం కాదన్నారు. కేంద్రం మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రజలు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడం అంత సులభం కాదన్నారు. అందరికీ ఆమోదయోగ్య నిర్ణయం తీసుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారు. తాను వ్యక్తిగతంగా విభజనకు ఒప్పుకోనని గుర్నాథ్ రెడ్డి చెప్పారు.

వ్యక్తిగత అభిప్రాయానికి చోటు లేదు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు చోటు లేదన్నారు. పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే అన్నారు. గుర్నాథ్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాల్సింది పార్టీ అంతర్గత ఫోరం లేదా స్పీకర్ అన్నారు. అన్ని ప్రాంతాల నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తమ పార్టీ వైఖరిపై అఖిల పక్షంలో లేఖ ద్వారా అందించామన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటే పార్టీ వేదిక పైనే చెప్పాలన్నారు.

English summary
Differences took place in YS Jaganmohan Reddy's YSR Congress party on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X