వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలిష్‌భాషలో రామాయణం: భారత ఇతిహాసాలు గొప్పవి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ramayana
వార్సా: భారత ఉత్తమ ఇతిహాసం రామాయణాన్ని పోలిష్ భాషలో లభ్యం కానుంది. జాన్సుజ్ క్రిజియోస్కి అనే ఇండోనిషియా దేశస్తుడు రామాయణాన్ని పూర్తిగా పోలిష్ భాషలోకి తర్జూమా చేశారు. 1816లో ఆ తర్వాత కాలంలో రామాయణంలోని పలు భాగాలు పోలిష్ భాషలోకి అనువదించబడ్డాయి. కానీ పూర్తి స్థాయిలో అంటే సంపూర్ణ రామాయణం మాత్రం పోలిష్ భాషలోకి తర్జూమా కావడం ఇదే తొలిసారి.

ఇప్పటి వరకు పలువురు మంచి మంచి రచయితలు పలు భాగాలను పోలిష్ భాషలోకి అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఇరవయ్యో శతాబ్ధంలో మరికొన్ని ఎక్కువ భాగాలు ఆ భాషలోకి అనువదించబడ్డాయి. జాన్సుజ్ క్రిజియోస్కి పలు పుస్తకాలు సేకరించి వాటి ద్వారా రామాయణాన్ని పోలిష్ భాషలోకి పూర్తిస్థాయిలో తర్జూమా చేశారు. రామాయణాన్ని వాల్మీకి సంస్కృతంలో రాశారు.

పోలిష్ విద్యార్థులు రామాయణాన్ని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తారని, అలాగే అందులో ఉన్న నీతి అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుందని, అలాగే భారత పౌరాణిక సాంప్రదాయం తమ పిల్లలకు తెలుస్తుందని తాను రామాయణాన్ని పూర్తి స్థాయిలో అనువదించానని చెప్పారు. రామాయణ, మహాభారతాలు మిగిలిన అన్ని ఇతిహాసాల కంటే ఎంతో గొప్పవని జాన్సుజ్ క్రిజియోస్కి అన్నారు. వాటిని మరే ఇతర గ్రంథాలతోనూ పోల్చలేమన్నారు.

భారత ఇతిహాసాల ముందు గ్రీకు ఇతిహాసాలు కూడా తీసికట్టుగా ఉంటాయన్నారు. రామాయణ, మహాభారతాలు మానవ జాతిలోనే ఉత్తమ ఇతిహాసాలు అని చెప్పవచ్చునని అన్నారు. భారతదేశ ఆధ్యాత్మికతను తెలుసుకునేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు.

English summary
Ramayana, the great Indian epic, is now available in Polish language, courtesy Janusz Krzyzowski, an Indologist in Poland who has translated the monumental work.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X