హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విడిపోతే హైదరాబాద్ రాష్ట్రమే: దానం, ముఖేష్ వ్యాఖ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mukesh Goud-Danam Nagender
హైదరాబాద్: రాష్ట్ర విభజన అనివార్యమైన పక్షంలో హైదరాబాదును ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని నగర మంత్రులు ముఖేష్ గౌడ్, దానం నాగేందర్‌లు బుధవారం డిమాండ్ చేశారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ఆమోదించే ప్రసక్తి లేదన్నారు. విభజన తప్పని సరి అయితే హైదరాబాదును ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్నారు. తమ వెనుక ఎవరో ఉండి మాట్లాడించడానికి తాము ఏమీ చిన్న పిల్లలం కాదన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమతో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారంటూ కొందరు చెబుతున్నారని అది సరికాదన్నారు. రాష్ట్ర విభజించదలిస్తే హైదరాబాదు తరఫున నగర ప్రతినిధులుగా తమ అభిప్రాయాలను కేంద్రం తీసుకోవాలని వారు అన్నారు. తెలంగాణ, సమైక్యాంధ్రలతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తెలంగాణ, సీమాంధ్ర నేతలు ఏర్పాటు చేసుకుంటున్న సమావేశాలకు తాము హాజరు కామన్నారు.

తమ పార్టీ అధిష్టానానికి తాము ఓ లేఖ పంపించామన్నారు. ఆ లేఖలో ఏముందో ఇప్పుడే బయట పెట్టమన్నారు. కేంద్రహోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్‌లకు తాము లేఖలు పంపించామన్నారు. హైదరాబాదులో అన్ని జిల్లాలు, రాష్ట్రాల నుండి వచ్చిన ప్రజలు వచ్చి జీవిస్తున్నారన్నారు. గ్రేటర్ హైదరాబాదును ప్రత్యేక రాష్ట్రంగా చేయాలన్నారు.

గ్రేటర్ హైదరాబాదు ప్రజలు తమపై ఎంతో నమ్మకంతో ఉన్నారన్నారు. తాము హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని అధిష్టానాన్ని కోరుతున్నట్లు ప్రచార సాధనాలలో వార్తలు వస్తున్నాయని కానీ, తాము ఎప్పుడూ అలా కోరుకోవడం లేదన్నారు. ప్రజాప్రతినిధులే లేని హైదరాబాదును ఎందుకని వారు ప్రశ్నించారు.

English summary
Hyderabad city minister Danam Nagender and Mukesh Goud were demanded for Separate Hyderabad state if partition is compulsory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X