హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అడ్డుకుంటాం: సమైక్యవాదులకు కవిత హెచ్చరిక

By Pratap
|
Google Oneindia TeluguNews

Kavitha
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గురువారం తలపెట్టిన సమైక్యవాద సదస్సును అడ్డుకుంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తనయ కల్వకుంట్ల కవిత సీమాంధ్ర నాయకులను హెచ్చరించారు. తెలంగాణపై నిర్ణయం వెలువడనున్న తరుణంలో సమైక్యాంధ్ర సదస్సు పేరుతో కుట్రలు చేస్తే సహించబోమని ఆమె బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

అవసరమైతే 144వ సెక్షన్ పెట్టి ప్రభుత్వమే సీమాంధ్ర నాయకుల సమైక్యవాద సదస్సును అడ్డుకోవాలని ఆమె సూచించారు. తెలంగాణ ఇస్తే విధ్వంసం సృష్టిస్తామన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యుడు గుర్నాథ్ రెడ్డి నిజస్వరూపం బయటపడిందని, తద్వారా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర శాసనసభ్యులు నిజస్వరూపం కూడా వెల్లడైందని ఆమె అన్నారు.

అమరుల త్యాగాలను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 28వ తేదీలోగా కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం ఆయన కాంగ్రెసు సీనియర్ నేత కె. కేశవరావుతో, మంత్రి కె. జానారెడ్డితో ఆయన సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ సాధన కోసం అన్ని శక్తులను ఏకం చేసి పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణపై అనుకూల నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. తెలంగాణను అడ్డుకునేందుకు గురువారం హైదరాబాద్‌లో సీమాంధర్ నేతలు సదస్సు ఏర్పాటు చేశారని ఆయన విమర్శించారు. రేపు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు మౌనదీక్ష ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఇందులో పాల్గొనాలని తాము కెకెను ఆహ్వానించినట్లు తెలిపారు. ఉమ్మడి రాజధానిపై వస్తున్న వార్తలపై ఇప్పుడే స్పందించబోమని కోదండరామ్ చెప్పారు.

English summary
Telangana Jagruthi president and Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao's daughter Kalwakuntla Kavitha has warned Seemandhra leaders on proposed Unified Andhra meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X