వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హర్యానా మాజీ సిఎం ఓం ప్రకాష్ చౌతాలా అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Om Prakash Chautala
న్యూఢిల్లీ: ఉపాధ్యాయ నియామకం కుంభకోణం కేసులో హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా అరెస్టయ్యారు. అయనతో పాటు ఆయన కుమారుడు అజయ్ చౌతాలా, మరో 53 మంది బుధవారం అరెస్టయ్యారు.

చౌతాలా ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో హర్యానాలో 3000 మంది ఉపాధ్యాయులను అక్రమంగా నియమించారనే ఆరోపణలు ఎదుర్కున్న కేసులో చౌతాలాను న్యూఢిల్లీ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో నిందితులందరినీ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో నిందితులకు శిక్షను కోర్టు జనవరి 22వ తేదీన నిర్ధారిస్తుంది.

హర్యానాలో 1999 - 2000 మధ్య 3.206 మంది జూనియర్ బేసిక్ టీచర్ల నియమాకం జరిగింది. ఈ కుంభకోణం కేసులో సిబిఐ 2008 జూన్ 6వ తేదీన చార్జిషీట్ దాఖలు చేసింది. ఒక్కో అభ్యర్థి తమ ఎంపిక కోసం 3 - 4 లక్షల రూపాయలు లంచంగా ఇచ్చినట్లు అంతకు ముందు ఆరోపణలు వచ్చాయి.

అంతకు ముందు సిబిఐ కోర్టు ఉపాధ్యాయ నియామకం కుంభకోణం కేసులో 2012 డిసెంబర్ 17వ తేదీన తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో పెట్టి తమ ముందు జనవరి 16వ తేదీన హాజరు కావాలని నిందితులందరినీ ఆదేశించింది.

English summary
Former Haryana Chief Minister Om Prakash Chautala, his son Ajay Chautala and 53 others were arrested for their involvement in teacher's recruitment scam on Wednesday, Jan 16.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X