వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తలలు నరకమని ఎవరూ చెప్పరు: భారత్‌పై హీనా ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hina Rabbani Khar
వాషింగ్టన్/న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: భారత్-పాకిస్తాన్ సరిహద్దు అంశంపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి హీనా రబ్బానీ ఖర్ స్పందించారు. భారత్ ఉద్దేశ్య పూర్వకంగా సరిహద్దు అంశాన్ని వివాదాస్పదం చేస్తోందని ఆమె ఆరోపించారు. భారత్ యుద్ధానికి రెచ్చగొట్టడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. యుద్ధ భేరీ మోగించేందుకు భారత్ రెచ్చగొడుతున్నట్లుగా కనిపిస్తోందన్నారు.

సరిహద్దు వెంబటి భారీగా బలగాలను మోహరించినట్లు చెప్పారు. జవాన్‌ల తలలు నిర్దాక్షిణ్యంగా నరకమని ఎవరూ చెప్పరని ఆమె అన్నారు. సరిహద్దు ఘటనపై భారత ఉన్నతాధికారులు చేసిన ప్రకటనలు తమను పూర్తిగా అసంతృప్తికి గురి చేశాయని ఆమె అన్నారు. అలాంటి ప్రకటనలు సరికాదన్నారు.

అయితే తాము భారత్‌తో పూర్తిగా శాంతి కోరుకుంటున్నామని అన్నారు. భారత ప్రకటనల పట్ల తాము సంయమనం పాటించామని అన్నారు. వారి ప్రకటనల పట్ల తాము వ్యాఖ్యల ద్వారా గానీ, యాక్షన్ ద్వారా కానీ ఘాటుగా ప్రతి స్పందించలేదన్నారు. భారత్‌తో శాంతి చర్చలకు తాము ఎప్పుడూ తలుపులు మూయలేదన్నారు. ప్రశాంత చర్చలు కొనసాగాలన్నారు. ఇలాంటి ఘటనల పట్ల తాము రాజకీయ లబ్ధి కోరుకోవడం లేదన్నారు.

పాక్ సైనికుడు హతం

మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఓ పాక్ సైనికుడిని భారత గస్తీ దళాలు హతం చేశాయి. ఇటీవల ఇరు దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. ఇద్దరు భారత జవాన్ల తలలు నరికి నిర్ధాక్షిణ్యంగా చంపడంతో ఉద్రిక్తత తలెత్తింది. జవాన్లను హత్యపై భారత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. పాక్ పైన నిప్పులు చెరిగింది. ఆ తర్వాత మరో ఇద్దరు సైనికులు మృతి చెందారు. తాజాగా ఓ పాక్ సైనికుడు మృతి చెందాడు.

English summary
Pakistan's foreign minister Hina Rabbani Khar went on a strident diplomatic offensive in the US on Tuesday, accusing India of "war-mongering" and embarking on a "narrative of hostility," while presenting her country as a paragon of peace and amity in the context of border tensions between the two countries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X