హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఎమ్మెల్యేపై లాయర్ల ఫిర్యాదు:సమైక్యభేటీతో టెన్షన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Gurnath Reddy - Kavitha
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనంతపురం జిల్లా ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి పైన తెలంగాణ లాయర్లు గురువారం ఉదయం జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఇస్తే రాష్ట్రం విధ్వంసం అవుతుందని గుర్నాథ్ రెడ్డి వ్యాఖ్యానించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ లాయర్లు పోలీసులను కోరారు. మరోవైపు ఈ రోజు మంత్రుల నివాస సముదాయంలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు సమావేశం కానున్నారు.

ఈ భేటీ కోసం సీమాంధ్ర ప్రతినిధులు ఒక్కరొక్కరు వస్తున్నాయి. ఈ భేటీని అడ్డుకుంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీ జెఏసి కూడా భేటీని అడ్డుకుంటామని చెప్పింది. ఈ నేపథ్యంలో మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో పోలీసు బలగాలను మోహరించారు. సమావేశం జరిగే ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించారు.

సమైక్యాంధ్ర భేటీని నిరసిస్తూ తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి గన్ పార్క్ వద్ద మౌన దీక్షను చేపట్టింది. జెఏసి చైర్మన్ కోదండరామ్ ఆధ్వర్యంలో ఈ మౌన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నగర మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్‌లు రోజుకో మాట మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణకు అనుకూలంగా ఉన్న సమయంలో ఇలాంటి ప్రకటనలు సరికావన్నారు. తెలంగాణపై త్వరగా ప్రకటన చేయాలని ఆయన అన్నారు. చింతన్ బైఠక్‌లో తేల్చాలన్నారు. తెలంగాణపై ప్రకటన చేసే వరకు కేంద్రాన్ని నమ్మలేమన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని ఉద్యోగ సంఘాల నేతలు విఠల్, దేవీ ప్రసాద్ అన్నారు.

సీమాంధ్ర సభను అడ్డుకునేందుకు తెలంగాణ విద్యార్థులు పలువురు ప్రయత్నించారు. వారిని పోలీసులు వారించే ప్రయత్నాలు చేశారు. ఈ దశలో పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు వారిని అదుపులోకీ తీసుకున్నారు. వారిని గోషామహల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. మరోవైపు సీమాంధ్ర సభను వ్యతిరేకిస్తూ, పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ప్రెస్ క్లబ్బులో తెలంగాణ కళాకారులు డిమాండ్ చేశారు.

English summary
Telangana lawyers were complains against YSR Congress Party MLA Gurnath Reddy for his convroversy comments in Jubilee Hills police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X