హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దానం కాన్వాయ్‌పై దాడి: వెంటాడి పట్టుకున్నవైనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Danam Nagender
హైదరాబాద్: కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ కాన్వాయ్ పైన పలువురు తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి నేతలు గురువారం ఉదయం దాడి చేశారు. దానం మంత్రుల భవన సముదాయం నుండి వస్తున్న సమయంలో కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన జెఏసి నేతలు ఆయన కాన్వాయ్ పైన దాడికి పాల్పడ్డారు. వెంటనే కారు దిగిన దానం ఆందోళనకారులను వెంబడించారు. అందులో ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

దాడికి పాల్పడిన పలువురిని పోలీసులు అదుపులోకీ తీసుకున్నారు. ఈ సమయంలో ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దానం తన ఆడి కారులో వెళుతుండగా ఈ దాడి జరిగింది. తన కాన్వాయ్ పైన దాడి చేయడంతో దానం ముఖం వెంటనే కందిపోయింది. దాడిని తీవ్రంగా ఖండించారు. తాను వెళుతుండగా, అడ్డుకొని దాడి చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఇది సిగ్గుచేటు అన్నారు.

స్వతంత్ర భారతంలో ఎవరి అభిప్రాయాలు చెప్పుకునే హక్కు వారికి లేదా అని ప్రశ్నించారు. విభజన అనివార్యమైతే హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని తాను నగర ప్రజల అభిప్రాయాన్ని చెప్పానన్నారు. బుధవారం దానం నాగేందర్ సహచర మంత్రి ముఖేష్ గౌడ్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. విభజించే పరిస్థితి వస్తే హైదరాబాద్ ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై ఆగ్రహించిన జెఏసి నేతలు ఈ రోజు దాడి చేశారు. అయితే దాడి చేసిన వారిలో కెయు జెఏసితో పాటు తెలంగాణ జాగృతి కార్యకర్తలు కూడా ఉన్నారు.

దానంపై ఫిర్యాదు

మంత్రి దానం నాగేందర్ అకారణంగా బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దానం తనపై అకారణంగా దాడి చేశారని నాంపల్లి కోర్టు క్రిమినల్ లాయరు తిరుపతి వర్మ ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఘటనలో గాయపడ్డ తెలంగాణ జాగృతి కార్యకర్తను గోల్కొండ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దీంతో భారీగా కార్యకర్తలు ఆసుపత్రికి తరలి వస్తున్నారు.

విశ్వరూప్ ఇంటి ముట్టడి

ఎస్ఆర్ నగర్‌లోని మంత్రి విశ్వరూప్ ఇంటిని తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి నేతలు ముట్టడించారు. తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. కాగా సీమాంధ్ర నేతల సమావేశాన్ని నిరసిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పోలీసులు వారిని ఎన్‌సిసి గేటు వద్ద అడ్డుకున్నారు.

English summary
Telanganites were attacked on minister Danam Nagender convoy on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X