వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు: ఉండవల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

Undavalli Arunkumar
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కాంగ్రెసు సీమాంధ్ర లోకసభ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. 1973లో ఆంధ్ర ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్న సీమాంధ్రులు నేడు రాష్ట్ర విభజనను ఎందుకు అంత తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారని ఆయన అడిగారు. 1973లో జై ఆంధ్రా అని నినదించినవారు నేడు సమైక్యాంధ్ర అని ఎందుకంటున్నారనే అంశంపై చర్చించడానికి ఓ సభను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం రాజమండ్రిలో ఈ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశానికి హాజరు కావాలని ప్రజా ప్రతినిధులందరికీ ఆయన ఆహ్వానాలు పంపించారు.

నలబై ఏళ్ల కిందట ఇదే సమయంలో కోస్తా, రాయలసీమ ప్రాంతమంతా జై ఆంధ్రా అంటూ ప్రత్యేక రాష్టర్ ఉద్యమ తీవ్రత బలంగా ఉన్న విషయాన్ని ఆయన తన ఆహ్వానంలో గుర్తు చేశారు. విద్యార్థులు 170 రోజులు, ఎన్జీవోలు 108 రోజుల పాటు చేసిన సమ్మెలు, హర్తాళ్, రాస్తారోకోలతో నెలల తరబడి ప్రజాజీవనం స్తంభించిపోయిందని ఆయన గుర్తు చేసారు. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో లాఠీచార్జీలు, అరెస్టులూ పోలీసు కాల్పులు జరగని ఊరంటూ లేదంటే అతిశయోక్తి కాదని ఆయన అన్నారు.

తాను విద్యార్థిగా జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో తాము రెండో తరగతి పౌరులుగా బతకలేమని, 1953లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రాన్ని యథాతథంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వేరు చేయాలని సీమాంధ్ర ప్రజలు ముక్తకంఠంతో ఘోషించారని ఆయన అన్నారు.

జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్న తాను 32 రోజులు పాటు జైలులో ఉన్నానని ఆయన చెప్పారు. 40 ఏళ్ల కిందట ఉవ్వెత్తిన ఎగసిన జై ఆంధ్ర ఉద్యమం చివరికి ఎలా ముగిసిందని ఆయన అడిగారు. మరుగున పడిపోయిన నాటి కొన్ని చారిత్రక సత్యాలను జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 1948లో హైదరాబాద్ రాజ్యం భారత్‌లో విలీనం, 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ, 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 1973లో జై ఆంధ్ర ఉద్యమం, 2013లోని యదార్థ పరిస్థితులను సమావేశంలో వివరిస్తానని ఆయన చెప్పారు.

English summary
Congress Rajamundry MP Undavalli Arunkumar hs decided to organise a meeting on January 25 to explain about Jai Andhra movement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X