వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఫ్యాక్టర్‌తో తెలంగాణ: ప్రత్యేకంతో జంప్ జిలానీలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: ఈ నెల 28వ తేదీలోగా కేంద్రం తెలంగాణపై నిర్ణయం ప్రకటించనుంది. అది తెలంగాణకు అనుకూలంగా ఉంటుందనే వార్తలు ఇప్పటికే జోరందున్నాయి. అధిష్టానం, కేంద్రం తెలంగాణకే అనుకూలంగా కనిపిస్తోందని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కూడా అంటున్నారు. తమను కలిసిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు కాంగ్రెసు పెద్దలు తెలంగాణలో సెంటిమెంట్ ఉందని, సీమాంధ్రలో జగన్ ఫ్యాక్టర్ ఉందని చెబుతున్నారట.

ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి ఉందని పరోక్షంగా చెప్పకనే చెబుతున్నారట. కాంగ్రెసు పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ చాలా కీలకం. ప్రస్తుతం ఇరు ప్రాంతాల్లో ఆ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దీంతో ఒక్క ప్రాంతంలోనైనా తమ పట్టు నిలుపుకోవాలనే భావనతో అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఇవ్వడం ద్వారా ఆ ప్రాంతంలోని పదహారు పార్లమెంటు సీట్లు గెలుచుకుంటామని భావిస్తోంది.

తెలంగాణ ఇవ్వని పక్షంలో సీమాంధ్రలో జగన్ ఫ్యాక్టర్, తెలంగాణలో సెంటిమెంట్ కారణంగా భారీ నష్టం వాటిల్లే ప్రమాదముందని భావిస్తోంది. అందుకే తెలంగాణ ఇచ్చి ఆ ప్రాంతంలో కాంగ్రెసు పార్టీని నిలబెట్టుకోవాలని చూస్తోందని అంటున్నారు. సీమాంధ్రపై కాంగ్రెసు పార్టీ చేతులు దులుపుకున్నదని అంటున్నారు. జగన్ ఫ్యాక్టర్ కారణంగా ఒక్క ప్రాంతంలోనైనా పార్టీని కాపాడుకునేందుకు కేంద్రం, కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు.

అయితే అదే కేంద్రం 'తెలంగాణ' నిర్ణయం ఇప్పుడు సీమాంధ్రలో జగన్‌కు మరింత కలిసి వచ్చేలా చేస్తోందని అంటున్నారు. తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వెలుడితే కాంగ్రెసు పార్టీ నుండి మరిన్ని వలసలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు ఉంటాయని అంటున్నారు. ఇప్పటికే అధికార పార్టీ నుండి వలసలు కొనసాగుతున్నాయి. ఒక రోజు క్రితమే కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.

కేంద్రం తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేస్తే మరింతమంది ప్రజాప్రతినిధులు జగన్ వైపు వెళతారనే ప్రచారం సాగుతోంది. తెలంగాణకు అనుకూలంగా ప్రకటన ఉంటుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో 28 తర్వాత నుండి వలసలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఫిబ్రవరిలో అధికార పార్టీ నుండి భారీగా జగన్ వైపు వెళ్లవచ్చునని అభిప్రాయపడుతున్నారు. జగన్ ఫ్యాక్టర్ కారణంగా తెలంగాణకు కేంద్రం అనుకూలంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తే.. కేంద్రం తెలంగాణ ప్రకటన జగన్‌కు మరింత కలిసి వచ్చేలా ఉందంటున్నారు.

English summary
It is said that many Congress leaders may join in YS Jaganmohan Reddy's YSR Congress party if Centre announce Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X