వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణకు అడ్డు చెప్పలేదు, విష ప్రచారం: గాదె వ్యాఖ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gade Venkat Reddy
హైదరాబాద్: తెలంగాణ కావాలన్న వాదనకు తాము ఎప్పుడూ అడ్డు చెప్పలేదని మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి శుక్రవారం అన్నారు. సిఎల్పీ కార్యాలయంలో ఆయన మధ్యాహ్నం విలేకరులతో మాట్లాడారు. సమైక్యాంధ్ర సమావేశం ద్వారా తాము తమ నిర్ణయాన్ని మాత్రమే అధిష్టానానికి తెలియజేశామన్నారు. తాము తెలంగాణ కావాలన్న వాదనకు ఎప్పుడు అడ్డు చెప్పలేదని అన్నారు.

నాయకుల మాటలను వక్రీకరించవద్దని సూచించారు. నాయకుల మధ్య విభేదాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోందని, అది సరికాదని ఆయన అన్నారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణపై అధిష్టానం నుండి ఇప్పటి వరకు ఎలాంటి సంకేతాలు అందలేదని ఆయన అన్నారు. విభేదాలంటూ విష ప్రచారం మానుకోవాలని ఆయన సూచించారు. సీమాంధ్ర ప్రజల నిర్ణయాన్ని మాత్రమే తాము అధిష్టానానికి చెప్పామన్నారు.

జెఏసి నేతల అరెస్టు సరికాదు

సమైక్యాంధ్ర కోసం శాంతియుతంగా సమావేశం జరపుకునేందుకు అనుమతి తీసుకునేందుకు యత్నించిన సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి నేతలను అరెస్టు చేయడం సరికాదని మంత్రి శైలజానాథ్ అంతకుముందు వేరుగా అన్నారు. తాము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని చెప్పారు. అధిష్టానానికి సీమాంధ్ర ప్రజల మనోభావాలను తెలియజేశామన్నారు. నిన్నటి సమావేశం ద్వారా అధిష్టానానికి సమైక్యాంధ్ర గళం వినిపించిందన్నారు.

తెలంగాణపై చర్చించకపోవచ్చు

జైపూర్ మేధోమథనం సదస్సులో తెలంగాణ అంశంపై చర్చించక పోవచ్చునని రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు జైపూర్లో అన్నారు. తమ ముందు రాష్ట్రంలో మూడు సవాళ్లు ఉన్నాయని.. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని ఎదుర్కొవడం ఒకటి, వైయస్సార్ కాంగ్రెసు, మజ్లిస్ ఆరోపణలు తిప్పి కొట్టడం రెండోది, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడం మూడోది అన్నారు.

English summary

 Former minister Gade Venkat Reddy said Friday that they are not opposing Telangana but appealing to high command about Samaikyandhra sentiment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X