విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పీలా వర్గం దాడి: బండారుకు బాలయ్య పరామర్శ

By Pratap
|
Google Oneindia TeluguNews

Balakrishna
విశాఖపట్నం: పార్టీ సంస్థాగత వ్యవహారాలపై నందమూరి హీరో, తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకృష్ణ దృష్టి పెట్టినట్లే ఉన్నారు. విశాఖపట్నం పెందుర్తిలో పార్టీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణ విషయంలో ఆయన శుక్రవారం వెంటనే స్పందించారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని ఆయన ఫోన్‌లో పరామర్శించారు. దాడి సంఘటనను మనసులో పెట్టుకోవద్దని ఆయన సత్యనారాయణ మూర్తికి సూచించారు.

బండారు సత్యనారాయణ మూర్తిపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పార్టీకి సూచించారు. వ్యవహారాన్ని క్రమశిక్షణా సంఘం పరిశీలించి, తగిన చర్యలు తీసుకునేలా చూస్తానని ఆయన బండారుకు హామీ ఇచ్చారు. ఎన్టీ రామారావు విగ్రహానికి నివాళులు అర్పించడానికి వచ్చిన బండారు సత్యనారాయణ మూర్తిపై పీలా శ్రీనివాస్ వర్గీయులు దాడి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బండారు సత్యనారాయణ మూర్తి - పీలాపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

విశాఖ జిల్లా పెందుర్తిలో ఎన్టీఆర్ వర్ధంతి సభ శుక్రవారం రసాభాసగా మారింది. ఎన్టీఆర్ వర్ధంతి సభ వేదికగా తెలుగు తమ్ముళ్ల మధ్య ఘర్షణ జరిగింది. షీలా శ్రీనివాస రావు, బండారు సత్యనారాయణ మూర్తి వర్గీయల మధ్య ఘర్షణ జరిగింది. బండారు సత్యనారాయణ మూర్తి పైన షీలా అనుచరులు దాడికి దిగారు. బండారు వర్గం ఎదురు తిరగడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. స్థానిక నేతలు, పోలీసులు ఇరువర్గాల వారిని శాంతపర్చారు.

పీలా వర్గానికి, బండారు సత్యనారాయణ మూర్తి వర్గానికి మధ్య గత కొంత కాలంగా ఆధిపత్య పోరు జరుగుతున్నట్లు సమాచారం. పీలా శ్రీనివాస్ నియోజకవర్గంలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, ఇందులో భాగంగానే శుక్రవారం బండారు సత్యనారాయణ మూర్తిపై దాడి జరిగిందని అంటున్నారు. దాడి జరిగిన తర్వాత బండారు సత్యనారాయణ మూర్తిని పీలా శ్రీనివాస్ కారు ఎక్కించి పంపించారు.

English summary
Nandamuri hero and Telugudesam party leader Balajrishna has spoken with former minister Bandaru Satyanarayana Murthy, who has been attacked ny the rival group of TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X