కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు షాక్: రవీంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ravindranath Reddy
కడప: కడప జిల్లాలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. జగన్ సమీప బంధువు, కడప మాజీ మేయర్ పి. రవీంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదైంది. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కుమ్మక్కై బోగస్ ఓటర్లను నమోదు చేశారని ఆయన చేసిన ఫిర్యాదు వివాదాస్పదమైంది. ఫోర్జరీకి పాల్పడ్డారన్న అభియోగంపై గురువారం కడప వన్‌టౌన్ పోలీసులు రవీంద్రనాథ్ రెడ్డిపై 420 సహా మరో మూడు కేసులు నమోదు చేశారు.

కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెద్ద చెప్పలి సొసైటీకి జరగనున్న ఎన్నికలలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై బోగస్ ఓటర్లను చేర్పించారని రవీంద్రనాథ్ రెడ్డి జిల్లా సహకార శాఖ అధికారికి గత డిసెంబర్ 31న లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆ లేఖలో సహకారశాఖాధికారి సంతకం, కార్యాలయం సీలు ఉన్నాయి. ఆ ఫిర్యాదు తమకు 12వ తేదీ మాజీ మేయర్ స్వయంగా అందించారని, అయితే ఆ పత్రంలో ఉన్న కార్యాలయం సీలు, చేసిన సంతకం తమది కాదంటూ జిల్లా సహకార శాఖాధికారి చంద్రశేఖర్ లిఖిత పూర్వకంగా తెలుగుదేశం నేతలకు తెలియజేశారు. దాంతో తెలుగుదేశం పార్టీ నేతలు సహకార శాఖాధికారులను నిలదీశారు.

గురువారం మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి నేతృత్వంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సహకార శాఖాధికారులు ఓ పక్షానికి సహకరిస్తున్నారంటూ ఆరోపించారు. అనంతరం పుత్తాతో పాటు మరికొందరు దేశం నేతలు ఎస్పీ మనీష్ కుమార్‌సిన్హా దృష్టికి తీసుకెళ్లారు.

ఈ విషయమై పెద్ద చెప్పలి సొసైటీకి చెందిన కుంచం శ్రీనివాసులరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మేయర్ రవీంద్రనాధ్‌రెడ్డిపై 420, 468, 471, 473 సెక్షన్ల కింద వన్‌టౌన్‌లో కేసులు నమోదయ్యాయి.

English summary
YSR Congress party YS Jagan's relative and Kadapa ex mayor Ravindranath Reddy has been booked for allegations forgery made against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X