India
  • search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గర్నాథ్ రెడ్డిపై ఫిర్యాదులు, మన హైదరాబాద్ కూడా

By Pratap
|
Google Oneindia TeluguNews
TRS made complaint against Gurunath Reddy
హైదరాబాద్: తెలంగాణ ఇస్తే విధ్వంసం, రక్తపాతం సృష్టిస్తామని చేసిన చేసిన వ్యాఖ్యలకు గాను మన హైదరాబాద్ సంస్థ ప్రతినిధులు పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మకు ఫిర్యాదు చేశారు. మన హైదరాబాద్ ప్రతినిధులు శ్రీధర్ ధర్మాసనం, కెఎల్ఎన్ స్వామి, మన్నారం నాగరాజ్, షాహబాద్ అలీ ఖాన్ బుధవారం అనురాగ్ శర్మను కలిసి గుర్నాథ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ఇస్తే విధ్వంసం, రక్తపాతం సృష్టిస్తామన్న వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యుడు గుర్నాథరెడ్డిపై హైదరాబాద్‌లో కేసులు నమోదయ్యాయి. తెరాస ప్రతినిధులు బంజారాహిల్స్ స్టేషన్‌లోను, న్యాయవాద జెఎసి సభ్యులు జూబ్లీహిల్స్‌స్టేషన్‌లోను ఫిర్యాదు చేశారు. గుర్నాథరెడ్డిపై ఐపీసీ 153(ఏ), 153(బీ), 504, 505(2) సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని తెరాస నాయకుడు శ్రవణ్ నేతృత్వంలో ప్రతినిధులు కోరారు.

శానససభ్యుడిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని ఆయన నిలదీశారు. చిన్నచిన్న నేరాలు చేసిన వారిని అరెస్ట్‌చేసే పోలీసులు, రక్తపాతం సృష్టిస్తామని వ్యాఖ్యలుచేస్తే ఎలా ఊరుకున్నారని మండిపడ్డారు. తెలంగాణవాదంపై గౌరవం ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఏం చెబుతారని, గౌరవం అంటే రక్తపాతం సృష్టించడమేనా అని అడిగారు.

శాసనసభ్యుడు గురునాథరెడ్డిపై 153(ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని అడ్వకేట్ జేఏసీ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధ్యతగల ప్రజాప్రతినిధి రెచ్చగొట్టేలా వాఖ్యానించడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని ఫిర్యాదులో అన్నారు. ప్రత్యేకరాష్ట్రాన్ని అడ్డుకునేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ జైల్లో ఉండి మంత్రాంగం చేస్తున్నారని జేఏసీ నాయకుడు కె గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు.

మజ్లీస్‌తో పొత్తు పెట్టుకొని మతకలహాలు సృష్టించేందుకు ప్రయత్నించాడని, అది సాధ్యం కాకపోవడంతో గురున్నాథరెడ్డితో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తున్నారన్నారు.

English summary
Complaint lodged by MAA HYDERABAD today with Commissioner of Police Sri. Anurag Sarma against YSRCP Anantapur MLA Sri. Gurunath Reddy for declaring to indulge in destruction of Hyderabad in case Telangana is announced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X