హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్బర్ హేట్ స్పీచ్: టీవీ చానెల్ ఆఫీసులో సోదాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Akbaruddin Owaisi
హైదరాబాద్: మజ్లీస్ శానససభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ద్వేషపూరిత వ్యాఖ్యలకు సంబంధించి ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీసులు శనివారం హైదరాబాదులోని ఓ టీవీ చానెల్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. హైదరాబాదులోని గుల్జార్ హౌస్‌లో గల టీవీ చానెల్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి అక్బరుద్దీన్ ప్రసంగానికి చెందిన చానెల్ హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో అక్బరుద్దీన్ చేసిన ప్రసంగాన్ని ఆ టీవీ చానెల్ ప్రసారం చేసింది.

ఇదిలా వుంటే, వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో అక్బరుద్దీన్‌ను నిజామాబాద్ జిల్లా కోర్టులో ప్రవేశపెట్టేందుకు ఈ నెల 25వ తేదీ వరకు గడువు పెంచారు. అక్బరుద్దీన్‌ను హాజరు పరచేందుకు గడువు పొడగిస్తూ మొదటి అదనపు ప్రథమశ్రేమి న్యాయమూర్తి శనివారం ఆదేశాలు జారీ చేశారు. భద్రత కారణాల రీత్యా అక్బరుద్దీన్‌ను కోర్టులో ప్రవేశపెట్టేందుకు గడువు కావాలని పోలీసులు కోరారు. పోలీసుల విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది.

అక్బరుద్దీన్‌కు కడుపునొప్పి రావడంతో ఆయనను శుక్రవా రం రాత్రి రిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్బరుద్దీన్ కడుపు నొస్తుందని జైలు అధికారులకు తెలియజేయడంతో ఆయనను వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్బరుద్దీన్‌కు రిమ్స్ వైద్యులు ఆల్ట్రాసౌండ్ స్కాన్. ఎక్స్‌రేతోపాటు బీపీ, ఇతర పరీక్షలు నిర్వహించారు. రిమ్స్ వైద్యులు డాక్టర్ సురేశ్‌ చంద్రతోపాటు, డాక్టర్ అశోక్, డాక్టర్ కళ్యాణ్‌రెడ్డి బృందం అక్బరుద్దీన్‌కు పరీక్షలు నిర్వహించింది. అనంతరం ఆయనను రాత్రి 9.30 గంటలకు జిల్లా జైలుకు తరలించారు. వైద్య పరీక్షల రిపోర్టులను డాక్టర్లు జైలు అధికారులు అందజేశారు. అక్బరుద్దీన్‌కు పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలోనే ఉన్నారు. అనంతరం వారు అక్బరుద్దీన్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

అక్బరుద్దీన్ లండన్‌లో చేయించుకున్న వైద్య పరీక్షల రిపోర్టులను పరిశీలించామని, ప్రతి రోజు డైటీషియన్ సూచనల మేరకు ఆహారాన్ని అందిస్తున్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు వారికి చెప్పారు. అక్బరుద్దీన్‌కు ఆరోగ్యం బాగానే ఉందనీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు సురేశ్‌చంద్ర, అశోక్ విలేకరులకు తెలిపారు. అక్బరుద్దీన్‌ను రిమ్స్‌కు తరలించే సమయం లో ఆదిలాబాద్ డీఎస్పీ మహేశ్వర్‌రాజు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు ఆసుపత్రి డోర్లను, గేట్లను మూసివేశారు.

కాగా ఆదిలాబాద్ జైలులో ఉన్న అక్బరుద్దీన్‌ను ఆయన భార్య షబానా, కూతురు ఫాతిమా, కొడుకు నూరుద్దీన్ శుక్రవారం ఉదయం 11 గంటలకు ములాఖత్‌లో కలిశారు. అక్బరుద్దీన్ ఓవైసీ కేసులో ఏ-2గా ఉన్న అజీమ్‌బిన్‌యాహియాను తమ కస్టడీకి ఇవ్వాలనీ, నిర్మల్ సభ అనుమతి తీసుకున్న అజీమ్‌బిన్‌యాహియా సంతకాల పరిశీలనకు అనుమతించాలని పోలీసులు వేసిన పి టీషన్లపై విచారణను నిర్మల్ మెజిస్ట్రేట్ ఈ నెల 19కి వాయిదా వేశారు.

English summary
Osmania University police conducted searches in a TV channel office in the Old city of Hyderabad in MIM MLA Akbaruddin Owaisi's hate speech case,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X