భార్యను హత్య చేసిన వ్యక్తికి కఠిన జీవిత ఖైదు

ఆ సంఘటన 2011 నవంబర్ 25వ తేదీన జరిగింది. జాగారాన్ని పోలీసులు 2012 మే 22వ తేదీన హుస్నాబాద్ మండల కేంద్రంలో అరెస్టు చేశారు. ఈ కేసులో 16 మంది సాక్షులను పరిశీలించారు. అతనికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి ఎ ప్రసాద రాజు జీవిత ఖైదుతో పాటు 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లలిత్‌పూర్ జిల్లా కాలాపహాడ్‌కు చెందిన జాగారం 16 ఏళ్ల క్రితం కరీంనగర్ వచ్చాడు. చిగురుమామిడి కేంద్రంలోని మైనింగ్ క్వారీలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. కుటుంబ సమస్యలపై దంపతులకు తరుచుగా గొడవలు జరుగుతుండేవి.
అదలా వుంటే, గుంటూరు జిల్లాలోని నరసారావుపేటలో రైలు కింద పడి తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు కేసు నమోదు చేశారు. మృతులను రాజ్యలక్ష్మి(40), సుశీల(19)లుగా గుర్తించారు. అప్పుల బాధ తాళలేక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications