హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసదుద్దీన్‌కు జగన్ పార్టీ బాసట: కక్ష అని వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Mysoora Reddy
హైదరాబాద్: మజ్లీస్ చీఫ్, హైదరాబాదు పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీకి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బాసటగా నిలిచింది. సంగారెడ్డిలో గతంలో అప్పటి కలెక్టర్‌ను దుర్భాషలాడిన కేసులో అసదుద్దీన్ ఓవైసీని అరెస్టు చేయడాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఎంవి మైసురారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఖండించారు.

కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అసదుద్దీన్‌పై కేసు బనాయించారని వారు మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. కాంగ్రెసును వ్యతిరేకించే పార్టీల నాయకులపై కేసులు పెడుతున్నారని వారు విమర్శించారు. సహకార ఎన్నికలను ప్రభుత్వం ప్రహసనంగా మార్చిందని వారన్నారు. సహకార ఎన్నికల ప్రక్రియ వ్యవహారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. రాష్టానికి చెందిన 8 కోట్ల మంది ప్రజలతో కాంగ్రెసు ఆడుకుంటోందని వారు వ్యాఖ్యానించారు.

ద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో అక్బరుద్దీన్ ఓవైసి అరెస్టుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దాదాపు మౌనం పాటించింది. అసదుద్దీన్‌ను అరెస్టు చేసిన తర్వాత మజ్లీస్‌కు అనుకూలంగా ఆ పార్టీ ముందుకు వచ్చి బాసటగా నిలిచింది.

కాగా, మజ్లీస్ నేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్‌ల అరెస్టును కాంగ్రెసు ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ సమర్థించారు. వారి అరెస్టు సమంజసమేనని ఆయన మంగళవారంనాడు మీడియా ప్రతినిధులతో అన్నారు. తప్పు చేశారు కాబట్టే వారు జైలుకు వెళ్లారని ఆయన వ్యాఖ్యానించారు. ఇందులో ప్రభుత్వ కుట్ర గానీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుట్రగానీ లేదని ఆయన అన్నారు.

ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడం వల్లనే కక్ష సాధింపు చర్యలకు దిగి అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీలను అరెస్టు చేయించినట్లు చేస్తున్న వాదనల్లో నిజం లేదని ఆయన అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి పైన, ప్రభుత్వంపైన చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన అన్నారు.

English summary
YS Jagan's YSR Congress party leaders have condemned the arrest of MIM chief and Hyderabad MP Asaduddin Owaisi. YSR Congress leaders MV Mysoora Reddy and Ummareddy Venkateswarlu termed Asaduddin's arrest as a conspiracy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X