వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీమాంధ్ర, తెలంగాణ నేతలు ఎదెరుదురు: పోటీ స్లోగన్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

Vayalar Ravi
న్యూఢిల్లీ: ఒకే పార్టీకి చెందిన ఇరు ప్రాంతాల నేతలు ప్రత్యర్థులుగా మారిపోయి అధిష్టానం పెద్దలను పోటాపోటీగా కలుసుకుంటున్నారు. ఈ స్థితిలో మంగళవారం ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి వాయలార్ రవిని కలిసి వెనక్కి వస్తున్న సీమాంధ్ర నేతలకు తెలంగాణ నేతలు ఎదురు పడ్డారు. ఈ సమయంలో సీమాంధ్ర నాయకులు సమైక్యవాద నినాదాలు చేయగా, తెలంగాణ నేతలు తెలంగాణ నేతలు చేశారు. పరస్పరం కరచాలనాలు చేసుకున్నారు, పలకరించుకున్నారు. ఇరు ప్రాంతాల నాయకుల కలయికను చూసి వాయలార్ రవి నవ్వారు.

వాయలార్ రవిని తొలుత సీమాంధ్ర నాయకులు నాయకులు కలిసి తమ వాదనలను వినిపించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన అవసరాన్ని వారు వాయలార్ రవికి వివరించారు. సీమాధ్ర నాయకుల వాదనలను కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వివరిస్తానని ఆయన చెప్పారు. మీ వాదనలో కొన్ని వాస్తవాలున్నాయని, ఆ విషయాలను ముందే ఎందుకు చెప్పలేదని వాయలార్ రవి సీమాంధ్ర నేతలతో అన్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ అవతరణ చరిత్రను సీమాంధ్ర నాయకులు ఆయనకు వివరించారు.

తెలంగాణలో సెంటిమెంట్ లేదని గాదె వెంకటరెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఓట్ల శాతం పడిపోయిందని, గత ఎన్నికల్లో 50 సీట్లలో పోటీ చేసి పది సీట్లలో మాత్రమే తెరాస గెలిచిందని, తెరాస రెచ్చగొట్టిందని, బావోద్వేగాలను రెచ్చగొట్టి తెరాస గెలిచిందని ఆయన అన్నట్లు సమాచారం. ఇరు ప్రాంతాల నేతలు కూర్చుని పరిష్కార మార్గం సూచించాలని, ఈ విషయాన్ని అధిష్టానానికి సూచిస్తానని వాయలార్ రవి వారికి చెప్పినట్లు తెలుస్తోంది. గాదె వెంకటరెడ్డితో వాయలార్ రవి ప్రత్యేకంగా మాట్లాడారు.

అంతకు ముందు, తెలంగాణ నేతలు హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో సమావేశమయ్యారు. విభజనకు తప్ప మరోదానికి అంగీకరించబోమని వారు ఆయనతో చెప్పారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి నివాసంలో సమావేశమై చర్చించుకుని వాయలార్ రవి వద్దకు వచ్చారు. సాయంత్రం ఏడు గంటలకు సీమాంధ్ర నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశం కానున్నారు.

English summary
Seemandhra and Telangana leaders face to face at union minister Vayalar Ravi's premises and made unified Andhra and Telangana slogans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X