హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై రాజీనామాలకు తెలంగాణ ఎంపీలు రెడీ

By Pratap
|
Google Oneindia TeluguNews

K Keshav Rao
హైదరాబాద్: ఈ నెల 28వ తేదీన తెలంగాణకు అనుకూలంగా ప్రకటన రాకపోతే 29వ తేదీన రాజీనామాలు చేయాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లోకసభ సభ్యత్వాలకే కాకుండా పార్టీకి కూడా రాజీనామా చేయాలని వారు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం నివాసంలో శుక్రవారం సమావేశమై వారు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణపై 28వ తేదీన ప్రకటన రాకుంటే 29వ తేదీన తమ కార్యాచరణ ప్రకటిస్తామని, తాము కఠిన నిర్ణయాలకు దిగుతామని చెబుతూ వారు కాంగ్రెసు అధిష్టానానికి ఓ లేఖ రాశారు.

అయితే, తెలంగాణపై ప్రకటన చేసేందుకు వారు పది రోజుల సమయం ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సమావేశానికి మధు యాష్కీ రాకపోవడంతో రాజీనామాలపై తుది నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. తెలంగాణ కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడుతామని సమావేశానంతరం కె. కేశవ రావు మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణ కోసం ఏ పార్టీలోనైనా కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. 28వ తేదీన ప్రకటన రాకపోతే తాడోపేడో తేల్చుకుంటామని అన్నారు.

బస్సుల్లో ప్రజలను తీసుకుని వచ్చి సభలు పెట్టాల్సిన గతి తమకు పట్టలేదని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర సభలో పాల్గొనే హక్కు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఉందని, బొత్సను తెలంగాణకు అనుకూలంగా తాను తీసుకుని వస్తానని ఆయన అన్నారు. తెలంగాణ వస్తుందని భయపడి సీమాంధ్ర నాయకులు ఒక్కటయ్యారని ఆయన అన్నారు. తెలంగాణ నాయకుల్లో ఐక్యత ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల్లో ఉంటే, సమైక్యవాదం నేతల్లో మాత్రమే ఉందని కెకె అన్నారు.

తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ వ్యంగ్యంగా మాట్లాడడం బాధ కలిగించిందని మందా జగన్నాథం అన్నారు. దళితుడైన కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేపై ఆజాద్ చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై తేల్చకపోవడంతో కాంగ్రెసు ప్రతిష్ట దిగజారుతోందని ఆయన అన్నారు.

తెలంగాణ సాధన కోసం తెలంగాణ ఎంపిలు కట్టుబడి ఉన్నారని ఎంపి వివేక్ అన్నారు. ఎన్ని శక్తులు తెలంగాణకు అడ్డువచ్చినా దీటుగా ఎదుర్కుంటామని ఆయన చెప్పారు. సమైక్యాంధ్ర సమావేశానికి బొత్స వెళ్లడం బాధాకరమని, అందుకు బొత్స వివరణ ఇవ్వాలని పొన్నం ప్రభాకర్ అన్నారు.

English summary
It is said that Congress MPs have decided to resign as MPs and from the Congress, if high command will not deliver a statement on Telangana on January 28.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X