వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఎస్సార్‌కు సమైక్య సెగ: మంత్రి ఇంటి ముట్టడి, అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Subbirami Reddy
విశాఖపట్నం/కడప: సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి నేతలు పలువురు ప్రజాప్రతినిధులను అడ్డుకున్నారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత టి.సుబ్బిరామి రెడ్డి నివాసాన్ని సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్యకార్యాచరణ సమితి ముట్టడించింది.

సమైక్యాంధ్ర కోసం కాంగ్రెసు పార్టీకి, పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అందరూ కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కాంగ్రెసు పార్టీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. సమైక్య ఉద్యమాల్లో పాలుపంచుకోవాలని డిమాండ్ చేశారు.

కడప జిల్లాలో మంత్రి అహ్మదుల్లా నివాసాన్ని సమైక్యాంధ్ర ఐకాస నేతలు ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు మంత్రి అహ్మదుల్లా నివాసం వద్దకు చేరుకొని సమైక్యాంధ్ర ఐకాస నేతలను అదుపులోకి తీసుకున్నారు.

కర్నూలు జిల్లాలోని విద్యార్థులు సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రభుత్వ నర్సుల సంఘం సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన చేపట్టింది. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం జరిపారు.

English summary

 Congress Party senior leader Subbi Rami Reddy and miniser Ahmedulla were faced Samaikyandhra stir on Friday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X