వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిక్చర్స్: భక్తి, తళుకులీనే కుంభమేళా రాత్రులు

By Pratap
|
Google Oneindia TeluguNews

అలహాబాద్: కుంభమేళాకు సంబంధించి ఏదో మిస్టరీ ఉందని భావించేవాళ్లు చాలా మంది ఉన్నారు. అందువల్లనే ప్రపంచంలోని నలుమూలల నుంచి కుంభమేళాకు పెద్ద యెత్తున ప్రజలు వస్తుంటారు. అత్యంత పెద్ద మతపరమైన ఉత్సవం ఇది. గంగానదీ జలాల్లో స్నానమాచరించి పవిత్రమై పోవడమే కాదు కుంభమేళా, అంతకు మించిన విశేషం ఉంది.

గంగాజలాల పవిత్రత గురించి హిందువులు ప్రత్యేకంగా నమ్ముతుంటారు. అయితే, అది మాత్రమే కాకుండా రాత్రుల్లు అద్భుతమైన వెలుగులను విరజిమ్ముతుంటాయి. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో జరిగే అతి పెద్ద మతపరమైన ఉత్సవం. నాగ సాధువుల నుంచి ప్రపంచవ్యాప్తంగా యాత్రికులు ఇక్కడికి వస్తుంటారు.

కుంభమేళా ప్రతి 12 ఏళ్లకు ఓసారి వస్తుందని కుంభమేళా అధికారిక వెబ్‌సైట్ తెలియజేస్తోంది. గంగ, యుమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో ఉత్సవం జరుగుతుంది. ఈ మూడు నదుల సంగమ ప్రదేశానికి అత్యంత పవిత్రతను ఆపాదిస్తుంటారు. ఈ మేళాకు వంద మిలియన్ల మంది హాజరవుతారని నిర్వాహకుల అంచనా.

 పిక్చర్స్: తళుకులీనే కుంభమేళా రాత్రులు

కుంభమేళా సందర్భంగా రాత్రులు ఇలా వెలుగులు విరజిమ్ముతాయి. కాంతుల కలబోతగా దృశ్యం అద్భుతంగా మారిపోతుంది.

 పిక్చర్స్: తళుకులీనే కుంభమేళా రాత్రులు

కుంభమేళా సందర్భంగా రాత్రులు ఇలా వెలుగులు విరజిమ్ముతాయి. కాంతుల కలబోతగా దృశ్యం అద్భుతంగా మారిపోతుంది. ఇలా కూడా...

 పిక్చర్స్: తళుకులీనే కుంభమేళా రాత్రులు

చూసే కోణాలు మారుతున్నప్పుడు కొంత వెలుగులు కనిపిస్తాయి. దీపసమూహం అద్భతమైన అచ్చెరువు కలిగిస్తుంది.

 పిక్చర్స్: తళుకులీనే కుంభమేళా రాత్రులు

కాంతి దారపు పోగులా ఇలా కనిపించి, అలా మురిపిస్తుంది. కాంతుల దారిగా కూడా తలపిస్తుంది.

 పిక్చర్స్: తళుకులీనే కుంభమేళా రాత్రులు

కాంతులు ముత్యాలు ఆరబోసినట్లు, ముత్యాల దండలు వేలాడదీసినట్లుగా కూడా అనిపిస్తుంది.

 పిక్చర్స్: తళుకులీనే కుంభమేళా రాత్రులు

దీపాల కాంతుల మధ్య ప్రజలు కూడా పసుపు బంగారం పూత పూసుకున్నట్లుగా కనిపిస్తారు.

 పిక్చర్స్: తళుకులీనే కుంభమేళా రాత్రులు

ప్రవాహంలో దీపకాంతులు ప్రతిఫలించి, ద్విగుణీకృత సౌందర్యాన్ని అందిస్తాయి. కాంతులు అద్భుతమైన దృశ్యాలుగా కనిపిస్తాయి.

 పిక్చర్స్: తళుకులీనే కుంభమేళా రాత్రులు

మానవ జీవితాలను కాంతివంతం చేయడానికే అన్నట్లుగా వెలుగులే వెలుగులే...

 పిక్చర్స్: తళుకులీనే కుంభమేళా రాత్రులు

దీపకాంతులు ముత్యాల ద్వారాల మాదిరిగా, ముత్యాల పూదండల్లాగా.... ఇంత కాంతిని భరించడం సాధ్యమా అన్నట్లుగా..

English summary
here is something mystic about Kumbh Mela. Perhaps that is why hordes of people from across the world come to visit the biggest religious festival. Kumbh Mela is not just about holy bathing at the Ganges. The festival turns into a glorious sight especially during night hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X