వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్రోల్ బాటిళ్లతో కెయులో ఉద్రిక్తత: ఇందిరాపార్కు వద్దా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tension at KU and Indira Park
వరంగల్/హైదరాబాద్: వరంగల్ జిల్లాలోని ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు పెట్రోల్ బాటిళ్లతో విశ్వవిద్యాలయ ఉపకులపతి(వైస్ ఛాన్సలర్) గది ముందు బైఠాయించారు. పోలీసులు అర్ధరాత్రి అనుమతులు లేకుండా వర్సిటీలోకి ప్రవేశించి విద్యార్థులను అరెస్టు చేశారని ఆరోపిస్తూ తెలంగాణ విద్యార్థి పరిషత్(టిజివిపి) విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారికి మిగతా విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి.

పోలీసులు అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని టిజివిపి డిమాండ్ చేసింది. ఉపకులపతి అనుమతులు లేకుండా ఎలా వస్తారని వారు ప్రశ్నించారు. వారు పెట్రోలు బాటిళ్లతో గది ముందు కూర్చున్నారు. పోలీసులు మరోసారి ఇలా రాకుండా హెచ్చరించాలని ఉపకులపతిని వారు డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండుకు ఆయన సానుకూలంగా స్పందించారు. అనుమతులు లేకుండా పోలీసులు రావొద్దన్నారు.

నిజాం హాస్టల్‌లో..

నిజాం హాస్టల్‌లో విద్యార్థులు ఆందోైళనకు దిగారు. ట్యూషన్ కోసం వెళ్తున్న తమ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకోవడమే కాకుండా కులం పేరుతో దూషించారని వారు ఆరోపించారు. పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థి సంఘాలు ఆందోళన బాటపట్టాయి.

సుదర్శన్ రెడ్డి ఇంటి ముట్టడి

భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి ఇంటిని భారతీయ జనతా పార్టీ గురువారం ముట్టడించింది. తెలంగాణ కోసం వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఇందిరాపార్కు వద్ద ఉద్రిక్తత

జెఏసి ఆధ్వర్యంలో సమరదీక్ష కొనసాగుతున్న ఇందిరాపార్కు ప్రాంతంలో సోమవారం ఉదయం స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పలువురు విద్యార్థులు పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను తొలగించుకొని గన్ పార్కుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు ఓయు నుండి ర్యాలీకి విద్యార్థులు బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు. పోలీసులు విశ్వవిద్యాలయం చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

English summary
Telangana JAC chairman Pro.Kodandaram said that they will target Congress party on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X