హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమైక్యంపై విహెచ్ ఫైర్: కెసిఆర్‌పై కేసుకు మంత్రి ప్రసాద్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Prasad Kumar-V Hanumanth Rao
హైదరాబాద్/న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడని సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడటమేమిటని కాంగ్రెసు పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు ప్రశ్నించారు. సీమాంధ్ర నేతలు తెలంగాణకు అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటం సాధ్యం కాదన్నారు.

తెలంగాణపై అధిష్టానం సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. లేదంటే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందన్నారు. విద్యార్థులు తెలంగాణ కోసం ఆత్మత్యాగాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2009లో తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన వెలువడిన తర్వాతనే సమైక్యవాదం ప్రారంభమైందని ఆయన ధ్వజమెత్తారు. జగన్‌కు వ్యతిరేకంగా సీమాంధ్ర నేతలు సభలు ఎందుకు పెట్టడం లేదన్నారు.

తెలంగాణకు వ్యతిరేకంగా సభలు పెట్టడం సరికాదన్నారు. రాష్ట్రం విడిపోతేనే రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. సామరస్యంగా ఆంధ్రప్రదేశ్ విడిపోయేందుకు అందరూ సహకరించాలని విహెచ్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏమైనా మాట్లాడతాడని, ఆయనది ప్రాంతీయ పార్టీ కాబట్టి అలా మాట్లాడతారని, తమదీ జాతీయ పార్టీ కాబట్టి అలా కుదరదన్నారు.

కెసిఆర్ పైన కేసు పెడతాం

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రధానమంత్రిని, దేశాన్ని కించపర్చేలా మాట్లాడారని, అందుకు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని మంత్రి ప్రసాద్ కుమార్ అన్నారు.

కెసిఆర్ అప్పుడు ఏం చేశారు?

కెసిఆర్ మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ కోసం ఎందుకు మాట్లాడలేదని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు 610 జివో గురించి, 6 సూత్రాల పథకం గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరిస్తే ఊరుకునేది లేదన్నారు.

English summary
Minister Prasad Kumar said on Tuesday that he will file complaint against TRS chief K Chandrasekhar Rao for his comments against PM Manmohan Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X