వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యడ్డీపై బిజెపి ఎదురుదాటి: అనర్హత, ఎమ్మెల్యేలతో భేటీ!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yeddyurappa
బెంగళూరు: ప్రభుత్వాన్ని పడగొడతానని నిత్యం హెచ్చరికలు జారీ చేస్తున్న కర్నాటక జనతా పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప పైన భారతీయ జనతా పార్టీ ఎదురు దాడికి సిద్ధమవుతోంది. యడ్డీ గతంలో ఉపయోగించిన దానిని ఇప్పుడు ఆయన పైకి ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. యడ్డీ సిఎంగా ఉన్నప్పుడు తిరుగుబాటు ఎమ్మెల్యేల పైన వేటు వేసి, ప్రభుత్వాన్ని రక్షించుకునే ప్రయత్నాలు చేశారు.

ఇప్పుడు బిజెపి కూడా అదే ప్రయోగానికి సిద్ధమవుతోంది. యడ్డీ అవిశ్వాసం పెట్టే పరిస్థితి ఉంటే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా యడ్డీ వర్గం ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేసేందుకు సిద్దమవుతోంది. తద్వారా ప్రభుత్వాన్ని రక్షించుకునే ప్రయత్నాలు చేస్తోంది. యడ్డీకి పన్నెండు మంది ఎమ్మెల్యేలు మద్దతు పలుకుతున్నారు. వారి సభ్యత్వాల్ని రద్దు చేసేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి జగదీష్ శెట్టార్ ఇద్దరు యడ్డీ వర్గం ఎమ్మెల్యేల పైన స్పీకర్ బోపయ్యకు ఫిర్యాదు చేశారు.

సోమవారం సభాపతి అందుబాటులో లేనందున ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాశ్‌కు ఫిర్యాదు చేశారు. బిజెపిపై గెలిచిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన శెట్టార్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని, వారిపై చర్య తీసుకోవాలని కోరారు. అనర్హత వేటు భయంతో యడ్డీ వర్గం ఎమ్మెల్యేల్లో ఇద్దరు వెనక్కి తగ్గారు.

తగ్గిన యడ్డీ

బిజెపి అనర్హతతో ఎదురుదాడికి దిగడంతో యడ్డీ తగ్గారు. తనకు శెట్టార్ ప్రభుత్వాన్ని కూల్చాలనే ఉద్దేశ్యం లేదని, 2013 14 బడ్జెట్‌ను ఆయనే శాసనసభలో ప్రవేశ పెడతారని, ప్రస్తుతం బిజెపి, కెజెపి సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోందన్నారు. కాగా స్పీకర్ బోపయ్య నేడు యడ్డీ వర్గం ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు.

English summary
KG Bopaiah, Speaker of the Karnataka Assembly, is expected to meet the loyalists of former chief minister and KJP president BS Yeddyurappa on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X