మా వెనుక కెవిపి పిచ్చిమాటలు: కెకె, యాష్కీ డుమ్మా

నిన్న సాయంత్రం పార్టీ అధికార ప్రతినిధి పిసి చాకో నుండి వచ్చిన ప్రకటన సంతోషాన్ని కలిగించినా, రాజీనామాలకే కట్టుబడి ఉన్నామన్నారు. తమతో మధుయాష్కీ ఒక్కరే విభేదించారన్నారు. అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా ఉన్నప్పుడు రాజీనామాలు సరికాదని ఆయన అభిప్రాయమని, ఆయన తెలంగాణకు కట్టుబడి ఉన్నారన్నారు. ఒక్క రాజీనామా విషయంలో మాత్రం ఆయన మాటలు వ్యక్తిగతం అన్నారు.
అధిష్టానంలో తెలంగాణ పట్ల పాజిటివ్నెస్ కనిపిస్తోందన్నారు. రాజ్యాంగ ప్రాసెస్ పూర్తి చేసే పనిలో ఉన్నామని చెప్పడం సంతోషకరమన్నారు. అయితే తమ ప్రాంత ప్రజల మనోభావాల మేరకు తాము రాజీనామాలకే కట్టుబడి ఉన్నామని, తెలంగాణపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు కేంద్రం, అధిష్టానంపై ఒత్తిడి పెంచుతామని చెప్పారు. ప్రజలు నమ్మే వరకు తాము రాజీనామాకు కట్టుబడి ఉంటామన్నారు.
నెల రోజుల్లో తెలంగాణ తేల్చుతామన్న కేంద్రం ఆ తర్వాత మాట తప్పిందన్నారు. అందుకే కాంగ్రెసును ప్రజలు విశ్వసించడం లేదన్నారు. ఎంపీలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డిలు వ్యక్తిగత పనుల వల్ల భేటీకి హాజరు కాలేదని చెప్పారు. మీడియా తమ మధ్య విభేదాలు ఉన్నాయంటూ తప్పుడు కథనాలు ప్రచురిస్తోందన్నారు. వాటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఎంపీలందరూ రాజీనామాకు కట్టుబడి ఉన్నారని చెప్పారు.
తాము స్పీకర్ ఫార్మెట్లో రాజీనామాలను సమర్పించామని రాజగోపాల్ రెడ్డి అన్నారు. వేరే పార్టీలో చేరేందుకు రాజీనామాలు చేయలేదన్నారు. రాజీనామాలు చేస్తే తెలంగాణ రాదని మేమే చెప్పామని కానీ, ప్రజల కోరిక మేరకు రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. రాజీనామాలతో అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. షిండే మాట తప్పడం, ఆజాద్ నిర్లక్ష్యపు మాటలు తమను బాధించాయన్నారు. కేవలం రాజీనామా విషయంలోనే యాష్కీతో విభేదించామన్నారు. తెలంగాణ వచ్చే వరకు ఆధిష్టానంతో పోరాటం చేస్తామన్నారు. కాగా ఈ భేటీకి మధుయాష్కీ రాలేదు.