వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై కేంద్రం ఇంకా చర్చిస్తోంది: మనీష్ తివారీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Manish Tiwary
న్యూఢిల్లీ‌: తెలంగాణ అంశంపై కేంద్రం చర్చలు జరుపుతోందని కేంద్ర మంత్రి మనీష్ తివారీ చెప్పారు. తెలంగాణ అంశంపై సంయమనం పాటించాలని ఆయన కోరారు. తెలంగాణపై ఎన్సీపి చీఫ్, కేంద్ర మంత్రి శరద్ పవార్ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణ సమస్య పరిష్కారం దిశగానే చర్చలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. లోక్‌పాల్‌పై కమిటీ సూచించిన 14 సవరణలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అన్నారు.

తెలంగాణకు అనుకూలంగా వెంటనే నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను కోరారు. ఆయన గురువారంనాడు షిండేను కలిశారు. తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతున్నాయని, ఇప్పటి వరకు 800 మందికిపై యువకులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన చెప్పారు. తెలంగాణపై తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సిన అవససరం ఉందని ఆయన అన్నారు.

తెలంగాణపై ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ యువతను కోరారు. తెలంగాణ కోసం జరుగుతున్న ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆయన గురువారం హైదరాబాదులో వ్యాఖ్యానించారు. తెలంగాణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో ఇక తెలంగాణ రాదనే బెంగతో యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.

తెలంగాణకు మద్దతు తెలిపిన శరద్ పవార్‌కు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు. శరద్ పవార్ సూచనమేరకైనా ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్ణయం తీసుకోవాలని ఆయన గురువారం హైదరాబాదులో అన్నారు.

English summary
The union minister Manish Tiwary has said that Talks are going on Telangana issue in direction of taking a decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X