చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయ పొలిటికల్ గేమ్: కమల్ టార్గెట్ వెనుక పెద్ద కథే?

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో కమల్ హాసన్ విశ్వరూపంకు అడుగడుగునా అడ్డంకులు ఎదురువుతున్న విషయం తెలిసిందే. కమల్‌ను జయలలిత ప్రభుత్వం టార్గెట్ చేసుకున్నందు వల్లే ఈ కష్టాలు వచ్చాయనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. కమల్‌ను జయలలిత లక్ష్యంగా చేసుకోవడం వెనుక వారి సంబంధాలు బెడిసి కొట్టడం వల్లనే అంటున్నారు. ఇటీవలే వారి మధ్య బెడిసికొట్టిందంట. కొద్దికాలంగా కమల్ తీరు పట్ల అసంతృప్తికి లోనైన జయ ఇప్పుడు ఆయనపై పగ తీర్చుకుంటున్నారంటున్నారు.

ఇటీవల కేంద్రమంత్రి చిదంబరం పాల్గొన్న ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో కమల్ హాసన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ... పంచె కట్టుకున్న వారు ప్రధాని కావాలని అభిప్రాయపడ్డారు. ఆ కార్యక్రమంలో జయలలిత రాజకీయ ప్రత్యర్థి, డిఎంకె చీఫ్ కరుణానిధి కూడా పాల్గొన్నారు.

ఆవిష్కరణ సభలో పాల్గొనడమే కాకుండా ఆయన మాట్లాడిన తీరు జయలలితకు ఆగ్రహం తెప్పించాయట. యూపిఏ అంటే జయ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. జయలలిత ప్రధాని పదవిపై మక్కువ పెంచుకున్నారు! ఎప్పటికైనా ప్రధాని కావాలనేది ఆమె కోరిక. ఇప్పుడు కమల్ ఇతరులు ప్రధాని కావాలని చెప్పడం ఆమెకు మంటను కలిగించిందట.

Kamal Hassan

అంతేకాకుండా విశ్వరూపం సాటిలైట్ హక్కులను మొదట జయ టివి రూ.12 కోట్లకు దక్కించుకుంది. అయితే రాజ్ కమల్ ఫిల్మ్స్‌కు, జయ టివికి మధ్య వచ్చిన విభేదాల కారణంగా ఈ సినిమా హక్కులు విజయ్ టివికి వెళ్లాయి. ఇక విశ్వరూపం సేలం డిస్ట్రిబ్యూషన్‌ను కరుణానిధి మనువడు ఉదయనిధి స్టాలిన్‌కు ఇచ్చారు. చిదంబరాన్ని పొగడటం ద్వారా జయలలితను కాదన్నట్లుగా మాట్లాడటం, సేలం డిస్ట్రిబ్యూషన్‌ను కరుణ కుటుంబానికి ఇవ్వడం, టివి హక్కుల వివాదం ఇలా.. ఇవన్నీ కమల్‌ను జయలలిత టార్గెట్‌గా చేసుకునేలా చేసిందని అంటున్నారు.

కమల్‌కు విజయకాంత్ మద్దతు

జయలలిత ప్రభుత్వం కావాలనే విశ్వరూపం చిత్రాన్ని అడ్డుకుంటోందని హీరో, ఎడిఎంకే అధినేత విజయకాంత్ ఆరోపించారు. జయలలిత కక్ష సాధింపు చర్యలు సరికావన్నారు.

English summary
The ongoing row over Viswaroopam is not simply due to some Muslims of Tamil Nadu alleging that the film shows the community in a bad light. At the root of the controversy lies a political angle that is much more intriguing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X