వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నగ్నచిత్రాల కోసం బెదిరింపు: 105 ఏళ్ల శిక్షకు అవకాశం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Karen used FB for woman photos
వాషింగ్టన్: సామాజిక వెబ్‌సైట్‌ల ద్వారా మహిళలు, అమ్మాయిల నగ్న చిత్రాల కోసం వారిని బెదిరించిన ఘటనలో ఇరవై ఏడేళ్ల కరేన్ గారీ కాజర్యాన్‌కు వంద సంవత్సరాలకు పైనా జైలు శిక్ష పడనుంది. కరేన్ మహిళల ఈమెయిల్ ఖాతాల్లోకి, సామాజిక వెబ్‌సైట్ల ఖాతాల్లోకి అక్రమంగా చొరబడి వారి నగ్న చిత్రాలు, అర్ధనగ్న చిత్రాలను కాజేసేవాడు.

తాను సేకరించిన ఆయా మహిళల నగ్న చిత్రాలను వారికి చూపించి బెదిరించేవాడు. ఇంకొన్ని నగ్న చిత్రాలు పంపించాలని వారిని హెచ్చరించాడు. ఈ నేరం పైన మంగళవారం అమెరికా పోలీసులు అతనిని అరెస్టు చేశారు. అతను దాదాపు మూడు వందల యాభైకి పైగా మహిళలను బెదిరించినట్లుగా పోలీసులు గుర్తించారు.

కొన్ని కేసులలో బాధితుల ఫేస్‌బుక్ పేజీలలో వారి నగ్న చిత్రాలను ఉంచాడు. కరేన్ కంప్యూటర్‌లో దాదాపు మూడు వేల మంది మహిళల నగ్న చిత్రాలు, అర్ధనగ్న చిత్రాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. అతనిపై ఉన్న అన్ని ఆరోపణలు రుజువైతే అతనికి నూటా అయిదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

English summary
A Glendele man who allagedly obtained photos of as many as 350 women was arrested on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X