వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాగ్రత్త!: విశ్వరూపంపై రోశయ్య: కమల్‌కు కిషన్ అండ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kishan Reddy - Rosaiah
చెన్నై/హైదరాబాద్: సున్నితమైన అంశాలపై సినిమాలు తీసే విషయంలో నిర్మాతలు అప్రమత్తంగా ఉండాలని తమిళనాడు గవర్నర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య శుక్రవారం అన్నారు. ఆయన శాసనసభలో ప్రసంగించారు. తన ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ... ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చిత్ర నిర్మాతలు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కమల్ హాసన్ విశ్వరూపం సినిమాపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కమల్ హాసన్‌కు కిషన్ రెడ్డి సంఘీభావం

కమల్ హాసన్ నిర్మించి, నటించిన విశ్వరూపం చిత్రంలో ముస్లింలను కించపర్చే సన్నివేశాలు ఏమీ లేవని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి శుక్రవారం హైదరాబాదులో అన్నారు. సినిమాలో ఓ వర్గాన్ని కించపర్చేలా ఏమీ లేవని ఆయన చెప్పారు.

కిషన్ రెడ్డితో పాటు బిజెపి సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, లక్ష్మణ్ తదితరులు గురువారం హైదరాబాదులోని ఆర్టీసి క్రాసు రోడ్డులో గల సంధ్య థియేటర్‌లో విశ్వరూపం చిత్రాన్ని చూశారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల పట్ల ముస్లిం వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటం, తమిళనాడు ప్రభుత్వం సినిమాను నిషేధించిన నేపథ్యంలో బిజెపి నేతలు సినిమాను చూడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా కమల్ హాసన్ నటించిన విశ్వరూపం చిత్రం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ సినిమా తెలుగు వర్షన్ ఇప్పటికే విడుదల కాగా హిందీ వర్షన్ ఈ రోజు విడుదలయింది. మిగిలిన పలు భాషల్లో ఆ సినిమా విడుదలయింది. అయితే తమిళనాడు ప్రభుత్వం మాత్రం ససేమీరా అంటోంది. అయితే ఈ రోజు జరుపుతున్న చర్చలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
Tamil Nadu Governor K. Rosaiah on Friday urged film makers to show due respect to the sensitivities of the people while making films and avoid hurting public sentiments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X