చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'విశ్వరూపం' గొడవ: కమల్ హాసన్ ఎలా దిగొచ్చారు?

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత దెబ్బకు స్టార్ హీరో కమల్ హాసన్ దిగి రాక తప్పలేదు. కేంద్ర ప్రభుత్వం కమల్ హాసన్‌కు మద్దతుగా వచ్చిన జయలలిత తన పట్టు వీడలేదు. ప్రభుత్వ తీరుకు తీవ్ర నిరాశకు, నిస్పృహకు గురైన కమల్ హాసన్ తొలుత మొండికేసినప్పటికీ క్రమంగా దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడింది. తమిళ సినిమా రంగమంతా దిగి, జయలలితతో మాట్లాడి, సర్దుబాటుకు కమల్ హాసన్‌ను ఒప్పిస్తే తప్ప సమస్య పరిష్కారం కాలేదు.

ముస్లిం సంస్థల నేతలతో చర్చలు జరపాలని సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా కమల్ హాసన్‌కు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. చెన్నైలోని ఆల్వార్‌పేటలో గల కమల్ హాసన్ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ కార్యాలయం బుధ, గురువారాల్లో స్తంభించిపోయినట్లుగా కనిపించింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో 24 గంటల రహస్య చర్చల తర్వాత, అందరూ ఒక్కటై రాజీకి ప్రయత్నాలు చేసిన తర్వాత కాస్తా కదలిక వచ్చింది.

గురువారం సాయంత్రం జయలలిత మీడియా సమావేశం, సినీరంగ ప్రముఖుల సమావేశం ఒక్కటి తర్వాత ఒక్కటి జరిగిన తర్వాత విశ్వరూపం కష్టాల్లో బయటపడుతుందనే సంకేతాలు అందాయి. విశ్వరూపం సినిమాపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఎత్తేసిన తర్వాత దానిపై జయ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది. దాంతో 15 గంటల పాటు సినిమా విడుదలను నిలిపేస్తూ హైకోర్టు ఫస్ట్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని కమల్ హాసన్‌కు సూచించింది.

Vishwaroopam

రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తే తాము కమల్ హాసన్‌తో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని తమిళనాడు ముస్లిం సంఘా సమాఖ్య అధ్యక్షుడు అపోలో హనీఫా చెప్పారు. ముస్లిం సంఘాలతో చర్చలకు ఆహ్వానం కోసం తాము ఎదురు చూస్తున్నామని కమల్ హాసన్ సోదరుడు చంద్రహాసన్ చెప్పారు.

కమల్ వద్ద రాధిక శరత్ కుమార్, శివకుమార్ కూర్చుని ఉన్న సమయంలో చలన చిత్ర దర్శకుడు అమీర్, కొంత మంది ప్రభుత్వాధికారులు ముస్లిం సంఘాల నాయకులతో మాట్లాడారు. కమల్ చర్చలకు చొరవ చూపాలని రాధిక సూచించారు. తాను దేశాన్ని, రాష్ట్రాన్ని వదిలేస్తానని ఆగ్రహించిన కమల్ హాసన్‌ను శివకుమార్ సముదాయించారు. అతను జయలలితకు సన్నిహితుడని అంటారు. ఇదంతా రాధిక, మరికొంత మంది ముఖ్యమంత్రి జయలలితను కలిసిన తర్వాతనే జరిగింది.

హైకోర్టు ఫస్ట్ బెంచ్ సినిమా విడుదలను నిలిపేస్తూ ఆదేశాలను జారీ చేయడానికి ముందుగా కొన్ని దృశ్యాలను తొలిగిస్తానని చెప్పిన తన వద్దకు వచ్చిన కొద్ది మంది ముస్లిం నేతలతో కమల్ చెప్పాడు. అయితే, ఇతర గ్రూపుల నుంచి హెచ్చరికలు ఆగిపోలేదు. దీంతో తమిళనాడును వదిలేసి, కట్స్ లేకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో సినిమాను విడుదల చేస్తానని చెప్పారు. ఫస్ట్ బెంచ్ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లడానికి కూడా తొలుత కమల్ హాసన్ నిర్ణయించుకున్నారు.

కోర్టు అనుమతి ఇచ్చినా ఫలితం ఉండదని, సినిమాను ప్రదర్శించవద్దని థియేటర్లకు హెచ్చరికలు జారీ చేయవచ్చునని, దానివల్ల సమస్య మరింత పెరుగుతుందని శివకుమార్, రాధిక కమల్ హాసన్‌తో చెప్పారు. ఆందోళనకారులతో చర్చలకు ముందుకు రావాలని దర్శకులు మణిరత్నం, భాగ్యరాజాలతో పాటు పలువురు సినీ ప్రముఖులు కమల్ హాసన్‌కు సూచించారు.

ఆ పరిణామాల నేపథ్యంలో జయలలిత మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముందు గురువారం ఉదయం ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్, హోం శాఖ కార్యదర్శి ఆర్ రాజగోపాల్, డిజిపి కె రామానుజన్‌లతో మాట్లాడారు. దీంతో సమస్య కొలిక్కి వచ్చింది. ముస్లిం సంఘాల నాయకులతో చర్చలు అనేవి లాంఛనంగానే మారిపోయాయి.

సినిమాలో 9 నిమిషాల నిడివిని తొలగించాలని ముస్లిం ఆందోళనకారులు కోరినట్లు కమల్ హాసన్ సోదరుడు చంద్రహాసన్ చెప్పారు. అయితే, ఈ విషయంపై తాను నిర్ణయం తీసుకోలేనని, కమల్ హాసన్‌కు నివేదిస్తానని చెప్పారు. శుక్రవారం ఉదయం ఆయన ముస్లిం సంఘాల నేతలతో చర్చలు జరిపారు.

English summary
While Kamal Hassan's 'Viswaroopam' remained in suspended animation, his production house Raajkamal International's office in Alwarpet witnessed some animated suspense through Wednesday and Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X