చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయలలిత 'విశ్వరూపం': దిగొచ్చిన కమల్ హాసన్

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: తనకు కమల్ హాసన్ మీద ఏ విధమైన వ్యక్తిగతమైన కక్ష లేదని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెప్పారు. కానీ ఆ మాటలు నమ్మే విధంగా లేవు. కమల్ హాసన్ బహుభాషా చిత్రం విశ్వరూపంపై తమిళనాడులో నిషేధం విధించినప్పటి నుంచి జరిగిన సంఘటనలు చూస్తుంటే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. అదే విధంగా గురువారంనాటి జయలలిత మీడియా సమావేశంలోని మాటలను బట్టి చూసినా ఉద్దేశ్యపూర్వకంగానే కమల్ హాసన్ సినిమాకు కష్టాలు తెచ్చిపెట్టారనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది.

కమల్ హాసన్‌పై జయలలిత పలు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కోట్లాది రూపాయలు పెట్టి తీసిన సినిమా వల్ల కమల్ హాసన్ దివాళా తీసే పరిస్థితి వచ్చింది. ఆ విషయంపై మాట్లాడుతూ జయలలిత అపహాస్యం చేసేందుకు కూడా వెనకాడలేదు. కమల్ హాసన్ తెలిసి కూడా రిస్కు తీసుకున్నారని, ఆ విషయం కమల్ హాసన్‌కు తెలుసునని, దానికి ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుందని ఆమె అన్నారు.

అంతేకాకుండా, థియేటర్ల వద్ద భద్రత కల్పించడానికి తగిన పోలీసు బలగాలు లేవని, అందుకే సినిమా విడుదలను నిలిపేశామని ఆమె చెప్పారు. భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా అనేది ప్రశ్న. ధోతీ కట్టుకున్నవారే ప్రధాని కావాలని కమల్ హాసన్ కేంద్ర మంత్రి చిదంబరానికి అనుకూలంగా మాట్లాడినందుకు తాను కక్ష పెంచుకున్నానని అంటున్నారని, ప్రధానిని కమల్ హాసన్ ఎంపిక చేయలేరని చెప్పడానికి తగిన అనుభవం తనకు ఉందని ఆమె అన్నారు.

Jayalalaitha-Kamal Hassan

తనపై కల్పనలను, అర్థం లేని ఆరోపణలు మీడియా చేసిందని ఆమె ఆడిపోసుకున్నారు. తమిళనాడులో తనను వ్యతిరేకించేవారి పట్ల జయలలిత ఎలా వ్యవహరిస్తారో చెప్పడానికి ఉదాహరణలు ఏమీ అవసరం లేదు. ఆ విషయం అందరికీ తెలుసు. దానికి తగిన మూల్యం చెల్లించకతప్పదని 58 ఏళ్ల కమల్ హాసన్‌కు కూడా అనుభవంలోకి వచ్చింది. విశ్వరూపం విడుదలలో ఆటంకాల వల్ల తనకు 60 కోట్ల నష్టం వాటిల్లిందని కమల్ హాసన్ చెప్పారు.

సినిమాను 90 కోట్ల రూపాయలతో నిర్మించామని, విడుదలలో జాప్యం వల్ల 30 నుంచి 60 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు మాత్రమే సినిమా విడుదలను నిలిపేశామని చెప్పి జయలలిత చేతులు దులుపుకునే పనిచేశారు. అదే చిత్రం ఇటు హైదరాబాదులోనూ, బెంగళూర్‌లోనూ ఆడుతుంటే తలెత్తని సమస్యలు తమిళనాడులో మాత్రమే తలెత్తుతాయా అనే సందేహం సందేహంగానే ఉంది.

తన నాయకత్వాన్ని అనుసరించాలని జయలలిత కమల్ హాసన్‌కు చెప్పకనే చెప్పారు. దానికితోడు, తన ప్రత్యర్థి అయిన డిఎంకె చీఫ్ కరుణానిధిపై విరుచుకుపడ్డారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె కరుణానిధిని హెచ్చరించారు. కొద్ది మంది ముస్లింల హెచ్చరికలకు లొంగిపోయి, ప్రభుత్వం భద్రత కల్పించలేని స్థితిలో పడిపోయిందా అనేది అనుమానంగానే ఉంది.

సినిమాను నిషేధించి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, తాను నేరుగా సినిమాను నిషేధించగలనని, కానీ ఆ పని చేయలేదని, సినిమా విడుదలను నిలిపేసి ఇరు వర్గాలు చర్చించుకుని ఓ అవగాహనకు రావాలని చెప్పానని అన్నారు. సినిమా విడుదలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న ముస్లిం సంస్థలపై చర్యలు తీసుకోవడానికి బదులు ఆ సంస్థల నేతలతో మాట్లాడి అవగాహనకు రావాలని కమల్ హాసన్‌కు సూచించారు.

కమల్ హాసన్ కొన్ని దృశ్యాలను తొలగించడానికి ఇష్టపడడం లేదని, శాంతిభద్రతలను కాపాడాలంటే 15 రోజుల పాటు 144వ సెక్షన్ విధించాల్సి వస్తుందని, ముస్లిం పెద్దలతో కమల్ హాసన్ చర్చించి, కొన్ని దృశ్యాలను తొలగిస్తే విడుదలకు మార్గం సుగమం చేస్తామని జయలలిత చెప్పారు.

అయితే, జయలలిత తీరుపై తీవ్రంగా నిరాశ చెందిన కమల్ హాసన్ హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టుకు వెళ్తానని చెప్పారు. కానీ ఆ తర్వాత దాన్ని విరమించుకున్నారు. తాను మరో దేశానికో, మరో రాష్ట్రానికో వెళ్తాననే మాటలు కమల్ హాసన్‌ పరిస్థితిని తెలియజేస్తున్నాయి. ఏమైనా, చివరకు పలువురి సలహాల మేరకు కమల్ హాసన్ దిగి రాక తప్పలేదు.

English summary
Those who have watched the live press conference of J Jayalalitha on news channels on Thursday, Jan 31, to clarify her government's position surrounding the controversial multilingual film "Viswaroopam" must have noticed how the head (Chief Minister) of Tamil Nadu behaved like a dictator. Rather than expressing remorse for failing to provide adequate security to help the film get released in the state, Jayalalitha was sarcastic about actor-director Kamal Hassan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X